Begin typing your search above and press return to search.
ఏపీ ఇరిగేషన్ మంత్రిపై చంద్రబాబు సెటైర్లు
By: Tupaki Desk | 13 Aug 2019 6:15 AM GMTప్రత్యర్థులు తనను విమర్శించినా, తాను ప్రత్యర్థులను విమర్శించినా ముఖంలో ఆవేశాన్ని, ఆవేదనను కనబరిచే టీడీపీ అధినేత చంద్రబాబునాయడు ఇప్పుడు తన తీరులో చాలా మార్పులు కనబరుస్తున్నారు. ముఖ్యంగా సెటైర్లతో రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు కురిపిస్తున్నారు. తాజాగా ఆయన పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీలోని వైసీపీ ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలోని నీటి పారుదల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై విమర్శలు కురిపించారు. మాటలు చెప్పినంత ఈజీ కాదు పెద్దపెద్ద ప్రాజెక్టులు చేయడమంటే అంటూ స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు. ఆ క్రమంలో పరోక్షంగా అనిల్ కుమార్ యాదవ్ పై ఘాటైన విమర్శలూ చేశారాయన.
పోలవరం వంటి భారీ ప్రాజెక్టు నిర్మాణమంటే కాంట్రాక్టర్లను బెదిరిం చడం, బెట్టింగులు నిర్వహించినంత సులభం కాదని చంద్రబాబు అన్నారు. కాఫర్ డ్యామ్ నిర్మాణం వల్లే గ్రామాలు మునిగిపోయాయి అంటూ కొత్తగా ఇరిగేషన్ పాఠాలు చెబుతున్నారని మంత్రులను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ఈ మేరకు సోమవారం ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రతి అంశంలో టెక్నికల్ కమిటీలు ఉంటాయని, కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ తో పాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీడ బ్ల్యూసీ నిబంధనల ప్రకారం నిర్మాణం ఉంటుందని పేర్కొన్నారు.
ఇంజనీర్లు, అనుభవజ్ఞులు ఎంతగానో ఆలోచించి డిజైన్లు రూపొందిస్తారన్న విషయాన్ని సదరు మేధావులు తెలుసుకోవాలని చంద్రబాబు ఎద్దేవా చేశారు. గోదావరి వరద వస్తుందని, ప్రభావిత గ్రామాలను ఖాళీ చేయించాలని రెండు నెలల ముందే పోలీసు రెవెన్యూ యంత్రాంగాలను ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారని అటువంటి ది ఈ మేథావులు ఇన్నాళ్లు ఏం చేశారని చంద్ర బాబు నిలదీశారు. వారికి చేతకాని ప్రతి పనికి తనను సాకుగా చూపించడం మానుకోవాలని, ఇప్పటికైనా పరిపాలన ఎలా చేయాలో నేర్చుకో వాలని చంద్రబాబు సూచించారు.