Begin typing your search above and press return to search.
6 రకాల భూములపై జగన్ కన్ను ... అందుకే ఆ సర్వే : చంద్రబాబు !
By: Tupaki Desk | 23 Dec 2020 11:01 AM GMTఆంధ్రప్రదేశ్ లో ప్రజల ఆస్తులు దోచుకునేందుకు హడావిడిగా భూముల రీసర్వే ప్రారంభించారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ప్రజల ఆస్తులు దోచేందుకు సీఎం జగన్ ప్రణాళికలు వేస్తున్నారని విమర్శించారు. చుక్కల, అసైన్డ్, సొసైటీ.. ఇలా 6 రకాల భూములపై ఆయన కన్నుపడిందని, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల తెదేపా ఇన్‌ఛార్జ్‌లు, సీనియర్ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా ఏరోజుకారోజు భూములను సరిచూసుకునే పరిస్థితి నెలకొందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ అండగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ల్యాండ్ మాఫియా పేట్రేగిపోతోందని చంద్రబాబు విమర్శించారు.
భూముల సర్వే అంటూ సీఎం జగన్ సర్కార్ హడావుడి చేయడానికి కారణం ఇదేనని పేర్కొన్నారు. భూ సర్వేతో రాష్ట్రంలోని ప్రజలంతా తమ భూములు ఏ రోజుకారోజు సరిచూసుకోవలసిన పరిస్థితిని కల్పించారని చంద్రబాబు ధ్వజమెత్తారు. సమగ్ర భూ సర్వే తో ప్రజలు ఆందోళన పడాల్సిన సమయం వచ్చిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి నియోజకవర్గంలోనూ వందల కోట్ల రూపాయల భూకుంభకోణాలు జరిగాయని అన్నారు. వైసీపీ పాలనలో అన్నివర్గాల ప్రజలను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రజల్ని వేధించడం, దాడులు, దౌర్జన్యాలతో బెంబేలెత్తించడమే వైసీపీ అజెండా అని విమర్శించారు
వైసీపీ మాఫియా దోపిడీకి హద్దుపద్దూ లేకుండా పోయిందని, పంచ భూతాలనూ మింగేస్తున్నారని విమర్శించారు. ఉచితంగా అందే ఇసుకకు ధర పెట్టి నిలువుదోపిడీ చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపి హయాంలో 15 వందల రూపాయలకే దొరికే ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు 8వేల రూపాయలు పెట్టినా దొరకని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు అధికారంలోకి వస్తే, ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తారో రాష్ట్ర ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతోందని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ మాఫియా రెచ్చిపోతుంది అంటూ వ్యాఖ్యానించారు. ఇళ్ల స్థలాలకు ఏమాత్రం పనికిరాని ముంపు భూములు , ఆవ భూములు విపరీతమైన ధరలకు ప్రభుత్వంతో కొనిపించి వేలకోట్లు దుర్వినియోగం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. శాండ్- ల్యాండ్, వైన్ -మైన్ మాఫియా దోపిడీకి హద్దుపద్దు లేకుండా పోతుందంటూ ఆరోపించారు. ఇళ్ల స్థలాలకు భూ సేకరణ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు నేతలు కలిసి నాలుగు వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు.