Begin typing your search above and press return to search.
పవన్ ... బాబును భలే ఇరకాటంలో పెట్టారే!
By: Tupaki Desk | 7 Sep 2021 3:02 AM GMTప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండు విషయాల మీదే జోరుగా చర్చ సాగుతోంది. అందులో ఒకటి వినాయక చవితి ఉత్సవాలపై జగన్ సర్కారు నిషేధం విధించడం.. మరొకటి రాష్ట్రంలో దారుణంగా దెబ్బతిన్న రోడ్లను బాగు చేయాలని జనసేన పోరాటం. గణేశ్‌ను అడ్డు పెట్టుకుని ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఇక దెబ్బతిన్న రోడ్ల సమస్యను వెలుగులోకి తీసుకు వచ్చిన జనసేన.. ఆ సమస్యను పరిష్కారించాలని జగన్ ఆదేశించడంతో ఆ విజయాన్ని తమ ఖాతాలో వేసేసుకుంది. అయితే ఈ సమస్యను తలకెత్తుకోవడం కారణంగా అందరి కంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కే ఎక్కువ లాభం చేకూరిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం వరుస సినిమా చిత్రీకరణలతో బిజీగా ఉన్న పవన్..రాష్ట్రంలో పార్టీని పట్టించుకునే పరిస్థితి లేదనే విమర్శలు వచ్చాయి. వచ్చే ఎన్నికలకు ఏడాది ముందు మళ్లీ ప్రజల్లోకి వచ్చి ఏదో హడావుడి చేస్తారని ఆయనపై ప్రత్యర్థి పార్టీలు విమర్శలు ఎక్కుపెట్టాయి. కానీ ఇప్పుడు వర్షాల కారణంగా దారుణంగా దెబ్బతిన్న రోడ్ల సమస్యను భుజాలకెత్తుకున్న ఆయన ఈ విషయంలో చాలా ఆక్టివ్‌గా కనిపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న రహదారుల ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయాలని జనసేన శ్రేణులకు ఆయనిచ్చిన పిలుపునకు భారీ స్పందన వచ్చింది. దీంతో ఈ విషయంపై మరింత వ్యతిరేకత రాకముందే రోడ్ల మరమ్మతులపై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత రోడ్లను బాగు చేయాలని.. మళ్లీ వర్షకాలం వచ్చేలోపే ఈ పనులు పూర్తి కావాలని ఆయన ఆదేశించారు. దీంతో తాము పోరాటం చేయడం కారణంగానే రోడ్లు బాగుపడుతున్నాయని జనసేన ఉత్సాహంతో ఉంది.
ఇక మరోవైపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి పూర్తి ఇరకాటంలో పడింది. రోడ్ల సమస్యపై ఓ వైపు జనసేన పోరాడుతుంటే.. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ మాత్రం చాలా వరకూ సైలెంట్‌గానే ఉంటుంది. అందుకు కారణం వేరే ఉంది. ఇప్పుడు గుంతలు తేలిన నాసిరకం రోడ్లన్నీ చంద్రబాబు హయాంలో వేసినవే కావడంతో టీడీపీ ఈ విషయంపై నోరు మెదపడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అప్పుడు వేసిన రోడ్లకు బిల్లులు కూడా చెల్లించకపోవడంతో ఆ భారం వైసీపీ ప్రభుత్వంపై పడింది. పైగా ఆ కారణంతో కాంట్రాక్టర్లు కూడా ముందుకు రావడం లేదు. ఒక రకంగా రోడ్లు దెబ్బతినడానికి టీడీపీనే కారణమనే అభిప్రాయం బలంగా ఉంది. అందుకే రోడ్ల సమస్యలపై ఆ పార్టీ నేతలు స్పందించడం లేదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.
ఇప్పుడు సీన్‌లోకి పవన్ రావడంతో ఇటు జగన్‌తో పాటు అటు బాబుకు ఇబ్బంది తలెత్తింది. ఈ రోడ్లు ఇలా అవ్వడానికి కారణం ఎవరూ అని ఆరా తీస్తే బాబు పేరు వస్తోంది కాబట్టి ఆ పాపం ఆయనదే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటికీ రోడ్ల దుస్థితికి కారణంగా టీడీపీ అని నిందించుకుంటూ కూర్చొకుండా వైసీపీ వాటి మరమ్మతుల కోసం ముందుకు సాగాలి. ఆ దిశగా జగన్ ఆదేశాలివ్వడం మంచి విషయమే. ఇలా రోడ్ల సమస్య విషయంతో తన పొలిటికల్ మైలేజీ పెంచుకోవడంతో పాటు జగన్, బాబును పవన్ ఇరకాటంలో పెట్టారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.