Begin typing your search above and press return to search.
మాటల్లో పొగరు కనిపిస్తే మీకే నష్టం బాబు!
By: Tupaki Desk | 17 March 2019 5:10 AM GMTఒక్కొక్కరి జాతకం ఒక్కోలా ఉంటుంది. కొంతమంది ఏం చేసినా అది గొప్పగానే కనిపిస్తుంది. అది వారి అదృష్టం. కొందరు ఏం చేసినా తేడాగానే కనిపిస్తుంటుంది. అది వారి దురదృష్టం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రకం. ఆయనేం మాట్లాడినా అది ఆయనకు వరం కంటే కూడా శాపంగా మారతుంటుంది. బాబు మాటల్ని ప్రస్తావిస్తూ.. ఆయనకు షాకింగ్ కౌంటర్లు ఇచ్చే వారెందరో కనిపిస్తారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో మరే అధినేతకు లేని రీతిలో.. బాబు పేరు చెప్పినంతనే నాన్ స్టాప్ గా తిట్టిపోసేటోళ్లు లక్షల్లో కనిపిస్తారు.రాష్ట్ర విభజనకు కారణమైన కేసీఆర్‌ను సైతం ఆంధ్రా ప్రాంతానికి చెందిన చాలామంది తిట్టే క్రమంలో పెద్దగా ఆసక్తి చూపించరు కానీ.. బాబు విషయంలో మాత్రం గుర్తుకు తెచ్చుకొని తిట్టేస్తుంటారు.
దీనికి కారణం పూర్తిగా బాబుదే. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో చెప్పిన మాట మీద నిలబడటం ఆయనలో కనిపించదు. ఈ రోజున ప్రధాని మోడీని ఇంతగా తిట్టిపోస్తున్న బాబు.. ఆయనతో మైత్రి ఉన్న వేళ ఎంతలా పొగిడారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ రోజున అంతగా పొగడాల్సిన అవసరం లేదు. ఈ రోజున ఇంతలా తిట్టాల్సిన పని లేదు. కానీ.. ఏం చేసినా అవసరానికి మించి చేయటంలో మాత్రం చంద్రబాబు ముందుంటారు.
తెలంగాణలో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాను ప్రదర్శించిన అత్యుత్సాహంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్.. బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పటం.. అందుకు తగ్గట్లే పావులు కదపటం తెలిసిందే. దీంతో.. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఎంతలా ఫేమస్ అయ్యిందో తెలిసిందే. నాటి నుంచి కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ భయం పట్టుకున్న బాబు.. ఆయన్ను ఉద్దేశించే అదే పనిగా విమర్శిస్తున్నారు.
గతంలో ఎప్పుడూ లేని రీతిలో కేసీఆర్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక్కడ ఆయన మిస్ అవుతున్న పాయింట్ ఏమంటే.. కేసీఆర్ అదే పనిగా నోటికి పని చెప్పారు. పదిసార్లు బాబు తిడితే.. కేసీఆర్ ఒక్కసారే తిడతారు. కానీ.. ఆ తిట్టే క్రమంలో దిమ్మ తిరిగిపోయే అంశాల్ని ప్రస్తావిస్తారు. ఎటకారపు కౌంటర్లు వేసి బాబు గాలి తీస్తారు.
ఈ విషయాన్ని గుర్తించిన బాబు.. గతంలో ఎప్పుడూ లేని రీతిలో కేసీఆర్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా తన ఎన్నికల ప్రచారాన్ని అధికారికంగా మొదలెట్టిన సభలో మాట్లాడుతూ కేసీఆర్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బాబు చేసిన వ్యాఖ్యల్లో పొగరు కనిపించిందన్న అభిప్రాయం ఉంది. ఇది ఏమాత్రం మంచిదికాదని చెబుతున్నారు. కేసీఆర్ లోని లోపాన్ని ఎత్తి చూపాలే కానీ.. ఆయనకు మేలు చేసేలా.. తెలంగాణ ప్రజల ఇగో హర్ట్ అయ్యేలా మాట్లాడకూడదన్న విషయాన్ని ఆయన మిస్ అవుతున్నారు. తెలంగాణలో ఆంధ్రా వాళ్లకు ఏం పని అని కేసీఆర్ అంటున్నారని.. ఇదే వేదిక మీద తన కోసం కేసీఆర్ వేచి చూసిన పరిస్థితిని మర్చిపోయారా? అని ప్రశ్నించారు. అంతేకాదు.. తన దగ్గర పని చేసిన కేసీఆర్ అంతలా విర్రవీగితే.. పని చేయించుకున్న తాను ఎంత విర్రవీగాలి? అంటూ మండిపడ్డారు.
మనల్ని కించపరిచే వారిని చూస్తూ సహించేది లేదని.. అలాంటి వారికి బెదిరేది లేదన్నారు. తిరుగుబాటుచేసి గుణపాఠం చెప్పే శక్తి సామర్థ్యాలు తనకున్నట్లుగా బాబు చెప్పారు. ఒకప్పుడు తన దగ్గర పని చేసిన కేసీఆర్.. అవన్నీ మర్చిపోయి ఏపీని దెబ్బ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ మండిపడ్డారు. మాటకు ముందు ఒకసారి.. మాటకు తర్వాత ఒకసారి నా దగ్గర పని చేసిన కేసీఆర్ లాంటి మాటలతో లాభం కంటే నష్టమే ఎక్కువన్నది బాబు మిస్ అవుతున్నారు. ఒకరు ఒకరి దగ్గర పని చేయటం తప్పు కాదు. ఆ విషయాన్ని ఎత్తి చూపి కించపరిచే కన్నా.. ఆయనలోని లోపాల్ని.. వ్యక్తిగతంగానూ.. ముఖ్యమంత్రిగా ఆయన వైఫల్యాల్నిఎత్తి చూపిస్తే మంచిది. అది వదిలేసి.. పొగరు మాటలు మాట్లాడితే మరింత నష్టమన్న విషయాన్ని బాబు గుర్తిస్తే మంచిది. బాబుకు మించి కేసీఆర్ కు మాట్లాడటం వచ్చన్న విషయాన్ని బాబు మిస్ అయితే ఎలా?