Begin typing your search above and press return to search.
పార్టీలతో సంబంధం లేకుండా కలిసిపోయే అరుదైన నేత
By: Tupaki Desk | 21 Feb 2022 12:30 PM GMTఏపీ మంత్రి గౌతం రెడ్డి మరణం ఇప్పుడు వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అందరిని కలిచివేస్తుంది. అన్నింటికి మించి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో.. ఒక పార్టీకి చెందిన నేత ఎవరైనా మరణిస్తే.. ఆ పార్టీ వారు స్పందించటం.. మిగిలిన పార్టీల వారిలో కొద్ది మంది మినహా పెద్దగా స్పందించని పరిస్థితి కనిపిస్తుంటుంది. ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో రాజకీయ ప్రత్యర్థుల చావును కోరేంత దరిద్రంగా రాజకీయాలు ఉన్నాయి.
అలాంటి వేళ.. ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మరణం.. అన్ని పార్టీలకు చెందిన నేతల నోట మాట రాకుండా చేస్తోంది. ఆయన మరణించారన్న విషయానికి విస్మయానికి గురవుతున్నారు. షాకింగ్ తో నోట మాట రాని పరిస్థితి.
గౌతమ్ రెడ్డి మరణించారన్న వార్త బయటకు వచ్చిన కాసేపటికే రాజకీయ వర్గాల నుంచి వచ్చిన తొలి సంతాప ప్రకటన విపక్షానికి చెందిన టీడీపీ ఏపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిది. గౌతమ్ హఠాన్మరణం తనను తీవ్రంగా కలిచి వేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా మరింత ఎదగాల్సిన నాయకుడ్ని మరణం కబళించిందన్న ఆయన.. పార్టీలకు సంబంధం లేకుండా అందరితో కలిసిపోయే నేత గౌతమ్ అని పేర్కొన్నారు. గౌతమ్ ఎంతో హుందాగా ప్రవర్తించేవారని.. ప్రజాప్రతినిధిగా ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు.
గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. గౌతమ్ రెడ్డి మరణం గురించి తెలిసిన కాసేపటికే టీడీపీ అధినేత చంద్రబాబు వారింటికి వెళ్లి నివాళులు అర్పించటంతో పాటు.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇలా వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా అన్ని పార్టీలకు చెందిన నేతలు గౌతమ్ రెడ్డి ఇంటికి వెళ్లి తమ ఆవేదనను పంచుకుంటున్నారు.