Begin typing your search above and press return to search.
మళ్లీ మొదలెట్టేసిన బాబు.. మళ్లీ అలాంటి మాటలే..
By: Tupaki Desk | 14 Nov 2019 6:19 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబులో ఇద్దరుంటారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరిస్తారు. పవర్ లో ఉన్నప్పుడు ఏదైతే చేయకూడదో అదే చేసే ఆయన.. పవర్ పోయినంతనే ఉలిక్కిపడి నిద్ర లేచినట్లుగా ఆదర్శాలు వల్లిస్తుంటారు. జెండా మోసే వారికే పదవులు అని చెప్పే ఆయన.. తీరా అధికారం వచ్చిన తర్వాత ఆ మాటల్ని అస్సలు పట్టించుకోరు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీలకు యాభై శాతానికిపైగా టికెట్లు అని చెప్పేసి.. తీరా ఎన్నికల వేళ మాత్రం తన పాత పద్దతిలోనే నిర్ణయం తీసుకుంటారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పే ఆదర్శాలలో ఒకట్రెండు అమలు చేసినా ఈ రోజు పార్టీ పరిస్థితి వేరుగా ఉండేది.
అధికారం లేని వేళలో బాబు నోటి నుంచే మాటలు తాజాగా మళ్లీ వస్తున్నాయి. పార్టీలో యువతకు పెద్దపీట వేస్తామని.. పార్టీ పదవుల్లో 33 శాతం కోటా అమల్లోకి తీసుకురానున్నట్లు చెప్పారు. పార్టీలో 35 ఏళ్ల లోపు వారికి 33 శాతం పార్టీ పదవులు ఇస్తామని చెప్పిన బాబు మాటల్ని విన్నోళ్లంతా.. బాబులో మరో మనిషి బయటకు వచ్చారంటున్నారు.
పార్టీకి సీనియర్ల అనుభవం.. యువతరం ఉత్సాహం అవసరమని చెప్పే చంద్రబాబు..పవర్లో ఉన్నప్పుడు ఆ పని ఎందుకు చేయలేదన్న ప్రశ్నను పలువురు సంధిస్తున్నారు. 1982లో పార్టీ పెట్టినప్పుడు చేరిన 18-35 ఏళ్ల యువతరం ఇప్పుడు 55-70 ఏళ్లకు చేరిందని.. ఇప్పుడు మూడో తరం ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైందన్న బాబు మాటలు వినేందుకు బాగున్నా.. ఆచరణలోకి మాత్రం ఇలాంటివేమీ ఉండవన్న మాట వినిపిస్తోంది.
ఆదర్శాలు వల్లించటం వేరు.. వాటిని అమల్లోకి తీసుకురావటం వేరు. ఇప్పటికే బోలెడన్ని ఆదర్శాల్ని వల్లెవేసిన చంద్రబాబు.. మాటల్నికట్టిపెట్టి చేతల్లో చేసి చూపించినప్పుడు మాత్రం నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు ఆ అంశం మీద ఆయన ఫోకస్ చేస్తే మంచిందంటున్నారు.