Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబుకు మ‌రిన్ని 'అడుగులు' కావాలి...!

By:  Tupaki Desk   |   11 Dec 2022 12:30 PM GMT
చంద్ర‌బాబుకు మ‌రిన్ని అడుగులు కావాలి...!
X
సాధార‌ణంగా రాజ‌కీయాల్లో 'ఒక అడుగు' ముందుకు వేస్తే.. అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తుంటుంది. పోనీ.. ఒక అడుగు కాక‌పోయినా రెండ‌డుగులు.. మూడ‌డుగుల్లో అధికారం అందుకున్న వారు ఉన్నారు. కానీ, టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు విష‌యానికి వ‌స్తే.. మ‌రిన్ని అడుగులు అవ‌స‌ర‌మయ్యే లా ఉన్నాయ‌నే వాద‌న వినిపిస్తోంది. ఎందుకంటే..చంద్ర‌బాబు వ్యూహాల‌కు అంద‌నంత రేంజ్‌లో రాజ‌కీ యాలు ఉండ‌డ‌మే.

ఏపీలో రాజ‌కీయాలు రోజుకో కీల‌క మ‌లుపు తిరుగుతున్నాయి. నిన్న ఉన్న‌ట్టు నేడు లేవు. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ ను తీసుకువ‌చ్చిన వైసీపీ అధినేత రాజ‌కీయంగా ప‌ట్టు పెంచుకుంటున్నార‌నే వాద‌న‌ను టీడీపీ బ‌లంగా వినిపించింది. అంటే.. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ టీడీపీకి వెన్నుపోటు పొడుస్తుంద‌ని అంచ‌నా వేసింది. వెంట‌నే మండ‌ల‌స్థాయిలో నాయ‌కుల‌ను.. పార్ల‌మెంట‌రీ పార్టీ జిల్లా నేత‌ల‌ను నియ‌మించింది. అయితే.. ఇప్పుడు మ‌రో వ్యూహం తెర‌మీదికి వ‌చ్చింది.

అదే.. 'గృహ సార‌థులు' పేరిట రాజ‌కీయంగా పూర్తి ఫోక‌స్ చేసేందుకు వైసీపీ రెడీ అయింది. వీరికి వంక పెట్టేందుకు, వీరిపై కోర్టుల్లో కేసులు వేసేందుకు ఎక్క‌డా అవ‌కాశం కూడా లేదు. కేవ‌లం వీరు.. పార్టీకి వ‌లంటీర్ల‌ను మించిన రీతిలో ప‌నిచేస్తారు. ప్ర‌తి 50 ఇళ్ల‌కు ఇద్ద‌రిని నియ‌మించినా.. ప్ర‌తిపాతిక ఇళ్ల‌కు ఒక్క‌రు చొప్ప‌న చాలా కీన్‌గా.. అబ్జ‌ర్వ్ చేస్తారు. ప‌రిస్థితుల‌ను పార్టీకి ఎప్ప‌టిక‌ప్పుడు వినిపిస్తారు.

ఇది.. ఒక సంచ‌ల‌న నిర్ణ‌యం.. అంతేకాదు.. టీడీపీకి బ‌ల‌మైన నాయ‌కులు ఎవ‌రైనా ఉంటే కూడా.. వారిని లొంగ దీసుకునేందుకు సైతం ప్ర‌య‌త్నించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మొత్తానికి ఈ ప‌రిణామం చూస్తే.. వైసీపీ వేస్తున్న అడుగుల‌కు ప‌దింత టీడీపీ అడుగులు వేయాల్సి ఉంటుంది.

అంతేకాదు.. గుజ‌రాత్ ఫ‌లితంపై ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు దృష్టి పెట్ట‌లేదు. అదే స‌మ‌యంలో వైసీపీ మూలాలు లాగుతోంది. అందుకే.. చంద్ర‌బాబుకు ఈ అడుగులు స‌రిపోవ‌డం లేద‌ని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.