Begin typing your search above and press return to search.

జగన్ దెబ్బకు చంద్రబాబు ఫ్లోర్ పై బైఠాయించాల్సి వచ్చిందా?

By:  Tupaki Desk   |   30 Nov 2020 3:10 PM GMT
జగన్ దెబ్బకు చంద్రబాబు ఫ్లోర్ పై బైఠాయించాల్సి వచ్చిందా?
X
వణికించే చలిలోనే వేడి పుట్టేలా ఏపీ అసెంబ్లీ వేదికైంది. ఆంధప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి.. బలమైన అధికార.. ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై చర్చించేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే అసెంబ్లీలో వైసీపీ.. టీడీపీ నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగింది.. నేటి అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు ఫ్లోర్ పై బైఠాయించడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

అసెంబ్లీ ప్రారంభం కాగానే తొలుత ప్రముఖుల మృతిపై సభ్యులంతా సంతాపం తెలిపారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ‌.. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంలకు ఏపీ అసెంబ్లీ సంతాపం తెలిపింది. ఆ తర్వాత టీడీపీ నేతలు మాట్లాడుతూ ఈ సమావేశాల్లో 20 అంశాలపై సమగ్రంగా చర్చించాలని డిమాండ్ చేశారు.

ఉపాధి హామీ బకాయిలు, ఇళ్ల పంపిణీ.. ఇసుక పాలసీ.. ఇళ్ల పట్టాల్లో అవినీతి.. పోలవరం.. స్థానిక ఎన్నికలపై చర్చించాలని టీడీపీ నేతలు పట్టుబట్టారు. ఈక్రమంలో టీడీపీ నేత నిమ్మల రామానాయుడు తుపాను పంట నష్టంపై మాట్లాడారు. దీనికి సీఎం జగన్ సమాధానం ఇచ్చారు. కాగా దీనిపై చంద్రబాబు మాట్లాడేందుకు ప్రయత్నించగా అధికార పక్షం నేతలు తీవ్రంగా అడ్డుపడ్డారు.

రైతుల సమస్యలపై తెలుగుదేశం ప్రశ్నలకు ప్రభుత్వం స్పందించగా.. దానిపై తాను మాట్లాడాలంటూ చంద్రబాబు నాయుడు పట్టుబట్టారు. నిమ్మల రామానాయుడుకు మాట్లాడే అవకాశం ఇవ్వడం.. తనకు ఇవ్వండని చంద్రబాబు పట్టబట్టారు. దీనికి డిప్యూటీ స్పీకర్ నిరాకరించాడు.

దీంతో చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోని ప్లోరుపై బైఠాయించి రచ్చ చేశాడు. నిరసన తెలిపాడు. ఆయనతోపాటు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కూడా స్పీకర్ పొడియం ఎదుట బైఠాయించాడు. నేల మీద కూర్చొన్న చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ను ఉద్దేశించి ‘ఏం పీకుతావ్’ అంటూ గద్దించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

చంద్రబాబు రచ్చపై సీఎం జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తనదైన శైలిలో సైటర్లు వేశారు. సభలో చంద్రబాబు నాయుడే రౌడీయిజం చేస్తూ.. మళ్లీ ఆయనే తనకేదో అన్యాయం జరిగిపోతున్నట్లు వ్యవహరిస్తున్నారంటూ కౌంటర్ ఇచ్చారు.

టీడీపీ నేతలు ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ జగన్ మండిపడ్డారు. డిసెంబర్ నెలాఖరు వరకు సబ్సిడీ ఇస్తామంటున్న చంద్రబాబు నాయుడు కావాలనే పోడియం వద్ద బైఠాయించారంటూ ఆరోపించారు. తొలి రోజు నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హిటెక్కడంతో మిగిలిన నాలుగురోజులు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.