Begin typing your search above and press return to search.

సంద‌ర్భం శ్యాడే.. అయినా.. బాబు ఓ ఫొటో వేసుకున్నారు.. మ‌రి జ‌గ‌న్‌?!

By:  Tupaki Desk   |   9 July 2022 12:30 AM GMT
సంద‌ర్భం శ్యాడే.. అయినా.. బాబు ఓ ఫొటో వేసుకున్నారు.. మ‌రి జ‌గ‌న్‌?!
X
సంద‌ర్భం శ్యాడే.. అయినా.. చంద్ర‌బాబు ఒక ఫొటోను ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. దీనిని చూసిన నెటిజ‌న్లు.. జ‌గ‌న్‌ను ట్రోల్ చేస్తున్నా రు. ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు ప్ర‌పంచ స్థాయి నేత‌ల‌తో పెంచుకున్న ప‌రిచ‌యాలు.. ప్ర‌పంచ మేధావుల‌ను కూడా క‌ట్టిపడేసిన సంద‌ర్భాల‌ను వారు గుర్తు చేస్తున్నారు.

మ‌రి జ‌గ‌న్ ఇలా ఎందుకు చేయ‌లేక పోతున్నారు? అనేది ప్ర‌శ్న‌. ఇంత‌కీ.. ఏం జ‌రిగిందంటే.. జ‌పాన్ మాజీ ప్ర‌ధాని, బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి షింజో అబే.. ఓ దుండ‌గుడి కాల్పుల్లో అత్యంత దారుణంగా గాయ‌ప‌డి మృతి చెందారు. ఇది చాలా దారుణ‌మైన సంద‌ర్భం. భార‌త్ కూడా ఒక‌రోజు సంతాప దినం పాటిస్తోంది.

అయితే.. ఈ సంద‌ర్భంలో చంద్ర‌బాబు.. షింజోతో తాను క‌లిసిన‌ప్ప‌టి ఫొటోను ట్వీట్ చేవారు. అబే మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయ‌న అస‌లు సిస‌లు నాయ‌కుడ‌ని కొనియాడారు. అబేపై దాడి ఘటన షాక్ కు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. విషాదం నుంచి కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారి కుటుంబసభ్యులకు సానుభూతిని ప్రకటించారు. అబేను తాను సీఎంగా ఉన్న‌ప్పుడు స‌త్క‌రించిన ఫొటోను పోస్టు చేశారు.

జపాన్ మాజీ ప్రధాని షింజో అబే(67) హత్యకు గురయ్యారు. దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన.. ప్రాణాలు విడిచినట్లు ఆ దేశ మీడియా ప్రకటించింది. పార్లమెంట్ ఎగువ సభకు ఆదివారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నరా ప్రాంతంలోని ఓ వీధిలో అబే ప్రసంగిస్తుండగా ఆయనపై దాడి జరిగింది. వెనుక నుంచి వచ్చిన ఓ దుండగుడు ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో అబే ఒక్కసారిగా ఛాతీపై చేయి పెట్టుకొని కుప్పకూలిపోయారు.

తీవ్ర రక్తస్రావమైంది. ఎలాంటి కదలికలు లేని ఆయనను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అబే శ్వాస తీసుకోవడం లేదని, గుండె కూడా చలనం లేదని తెలిసింది. ఆయన కార్డియో పల్మనరీ అరెస్టు పరిస్థితిలో ఉన్నారని టోక్యో మాజీ గవర్నర్‌ కాసేపటికి వెల్లడించారు. కొన్ని గంటల తర్వాత.. అబే మరణించారన్న వార్తను అక్కడి మీడియా ధ్రువీకరించింది.

ఈ విష‌యాన్నే ప్ర‌స్తావిస్తూ.. జ‌గ‌న్‌కు ఇలా.. ప్ర‌పంచ నేత‌ల‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని తెలిపే ఒక్క అంశం అయినా ఉందా? అని ప్ర‌శ్నిస్తున్నారు.