Begin typing your search above and press return to search.

మైనారిటీల కోసం.. బాబు ప్ర‌య‌త్నం.. స‌క్సెస్ అయ్యేనా?

By:  Tupaki Desk   |   23 Aug 2021 5:30 PM GMT
మైనారిటీల కోసం.. బాబు ప్ర‌య‌త్నం.. స‌క్సెస్ అయ్యేనా?
X
టీడీపీ అదినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పార్టీని డెవ‌ల‌ప్ చేసుకునేందుకు వివిధ మార్గాల‌నుఅ నుస‌రిస్తున్నారు. గ‌త 2019 ఎన్నిక‌ల్లో పార్టీ ఘోర‌మైన ప‌రాభవం చ‌విచూశాక‌.. పార్టీని పుంజుకునేలా చేసేందుకు వ్యూహాత్మ‌కంగా ముందుకు క‌దులుతున్నా రు. ప్ర‌ధానంగా సామాజిక వ‌ర్గాల వారీగా.. ఓట్ల‌ను రాబ‌ట్ట‌డం.. ఇటీవ‌ల కాలంలో పార్టీలు ఎంచుకుంటున్న వ్యూహాత్మ‌క విష‌యమ నే సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో కులాలు, మ‌తాల వారీగా.. కూడా ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు త‌ర‌చుగా త‌మ‌ది బీసీల పార్టీ అంటూ.. ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తుంటారు.

అయితే.. అదే బీసీ సామాజిక వ‌ర్గానికి జ‌గ‌న్‌.. అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నారు. వారి ఓటు బ్యాంకును త‌న‌వైపు తిప్పుకొనేందుకు ఆయా సామాజిక వ‌ర్గాల్లోని 56 కులాల‌కు కార్పొరేష‌న్లు ఏర్పాటు చేశారు. సో.. టీడీపీ కంచుకోట‌గా భావించే బీసీ వ‌ర్గాన్ని జ‌గ‌న్ త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేయ‌డంలో ఇప్ప‌టి వ‌ర‌కు స‌క్సెస్ అయ్యారు. ఇక‌, ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు.. టీడీపీకి చాలా దూరంగా ఉంది. 2014 కంటే.. 2019లో ఈ గ్రాఫ్ మ‌రింత ప‌డిపోయింది ఎస్సీలు... ఎస్టీలు పోటీ చేసిన చోట‌.. ఒక్క కొండ‌పి మిన‌హా ఎక్క‌డా టీడీపీ విజ‌యం ద‌క్కించుకోలేదు. సో.. ఎస్సీలు, ఎస్టీలు దూర‌మ‌య్యార‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ఈ క్ర‌మంలోనే ఎస్సీ నాయ‌కులకు చంద్ర‌బాబు ఇటీవ‌ల కాలంలో పార్టీలో కీల‌క ప‌ద‌వులు అప్ప‌గిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వంగ‌ల‌పూడి అనిత‌కు తెలుగు మ‌హిళ అధ్య‌క్ష ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. ఇక‌, మాజీ మంత్రి కేఎస్ జ‌వ‌హ‌ర్‌కు కీల‌క ప‌ద‌వులు ఇచ్చారు. ఇలా.. ఎస్సీల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇదిలావుంటే.. ఇప్పుడు అత్యంత కీల‌కంగా మారిన మైనార్టీ వ‌ర్గాన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. వాస్త‌వానికి 2014లోనే మైనారిటీ నేత‌లు ఎవ‌రూ కూడా టీడీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకోలేక పోయారు.

దీంతోవిజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌వ‌క‌ర్గం నుంచి వైసీపీ త‌రఫున గెలిచిన జ‌లీల్ ఖాన్‌ను త‌న పార్టీలో చేర్చుకున్నారు. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న త‌న కుమార్తెను టీడీపీ టికెట్‌పై పోటీ చేయించినా.. ఓడిపోయారు. ఈ ప‌రిణామాల‌తో టీడీపీ మైనార్టీ నేత‌లు చెప్పుకోద‌గ్గ స్థాయిలో ఎవ‌రూ లేర‌నేది వాస్త‌వం. ఈ క్ర‌మంలోనే క‌ర్నూలుకు చెందిన ఫ‌రూక్‌ను బాబు ఇప్పుడు రంగంలోకి దింపుతున్నారు. ఆయ‌న ద్వారా.. మైనార్టీ తీగ లాగేలా చేస్తున్నారు. తాజాగా ఫరూఖ్ మాట్లాడుతూ వైసీపీ బీజేపీలది చీకటి బంధం అంటూ విమర్శించారు.

ఈ రెండు పార్టీలు కలసికట్టుగానే ఉన్నాయని కూడా చెప్పుకొచ్చారు. పైకి మాత్రం విభేదిస్తున్నట్లుగా నాటకాలు ఆడుతున్నా యని కూడా ఫరూఖ్ ఒక రేంజిలో చెలరేగారు. దానికి నిదర్శనం విజయసాయిరెడ్డికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో స్థానం కల్పించడం అని కూడా ఆయన చెబుతున్నారు. ఇది ఒక‌ర‌కంగా.. మైనార్టీ వ‌ర్గాన్ని వైసీపీకి దూరం చేసే క్ర‌మంలో చంద్ర‌బాబు చేసిన ప్ర‌య‌త్నంగా రాజ‌కీయ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. అయితే.. ఇక్క‌డ వ్యాఖ్య‌లు సీరియ‌స్‌గానే ఉన్న‌ప్ప‌టికీ.. అవి చేసిన నేత‌.. విష‌యంలోనే సందేహాలు వ‌స్తున్నాయి.

ఎందుకంటే.. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో విజ‌యంద‌క్కించుకోని.. ఫ‌రూక్‌కు చంద్ర‌బాబు.. ఎమ్మెల్సీ క‌ట్ట‌బెట్టి.. మండ‌లి తొలి చైర్మ‌న్‌గా ఛాన్స్ ఇచ్చారు త‌ప్ప‌.. ఇంకే మీ లేదు. సో.. ఇంత‌క‌న్నా.. ఆయ‌న‌కు ఓ ల‌క్ష‌మంంది ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు.. ఓ 10 వేల ఓట్లు తెచ్చుకునే సామ‌ర్ధ్యం రెండూ కూడా లేవు. దీనిని బ‌ట్టి.. బాణం బాగున్నా.. ఓటి విల్లుతో చంద్ర‌బాబు ప్ర‌యోగం చేస్తున్నార‌నే వ్యాఖ్య‌లు రాజ‌కీయ విశ్లేష‌కుల నుంచి వినిపిస్తున్నాయి. దీంతో ఫ‌రూక్ వ్యాఖ్య‌ల‌కు ప్రాధాన్యం క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు.