Begin typing your search above and press return to search.
చంద్రబాబు విలపించడానికి కారణం.. ఆమె ఫోన్ కాలేనట!
By: Tupaki Desk | 21 Nov 2021 6:31 AM GMTఏపీ అసెంబ్లీలో అనూహ్య పరిణామాల తర్వాత చంద్రబాబు మీడియా ఎదుట బోరున విలపించారు. అంతకుముందు టీడీఎల్పీ సమావేశంలో కూడా ఆయన కన్నీటి పర్యంతమయ్యారని చెబుతున్నారు. ఎంతో ధైర్యంగా ఉంటే చంద్రబాబు.. ఒక్కసారి చిన్న పిల్లాడిలా గుక్కపట్టి ఏడ్చడాన్ని చూసిన టీడీపీ నేతలు ఒక్కసారిగా భయపడ్డారట.
అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత టీడీఎల్సీ సమావేశంలో కూడా కొద్ది సేపటి వరకు ఆయన ధైర్యంగా ఉన్నారని చెబుతున్నారు. ఇంతలోనే ఆయనకు ఓ ఫోన్ కాల్ వచ్చిందని చెబుతున్నారు.
ఆ ఫోన్‌లో సారాంశాన్ని విన్న చంద్రబాబు ఒక్కసారిగా విలవిలా ఏడ్చారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి ఐదు నిమిషాలు కూడా కాలేదు. ఇంతలోనే సభలో జరిగిన రభస, చంద్రబాబు సతీమణిపై చేసిన అసభ్య వ్యాఖ్యలు బయటకు ఎలా తెలిశాయని టీడీపీ నేతలు ఆరా తీశారట.
ఆరా తీస్తే ఆ ఫోన్ కాల్.. భువనేశ్వరి నుంచి వచ్చిందని తెలిసిందట. ఫోన్ సంభాషణ ముగిసిన వెంటనే చంద్రబాబు తన ఛాంబర్‌లో కూర్చుని ఏడుపు మొదలెట్టారని చెబుతున్నారు. చంద్రబాబును ఎలా సముదాయించాలో అర్థం కాక అందరూ కొద్ది సేపు మౌనంగా ఉన్నారట.
భావోద్వేగంలో ఉన్న చంద్రబాబు తనను తాను సముదాయించుకుని.. తర్వాత జరగాల్సిన కార్యచరణపై నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. తాను ఇప్పుడు మాట్లాడే స్థితిలో లేనని టీడీపీ ఎమ్మెల్యేలతో చెప్పారట. ఎందుకు అసెంబ్లీని బహిష్కరిచాల్సి వచ్చింది.
ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాము.. ఈ విషయాలను సభలో తెలిపే అవకాశం ఇవ్వలేదు కాబట్టి.. మీడియా ద్వారా అన్ని విషయాలు చెబుదామని చంద్రబాబును నేతలు ఒప్పించినట్లు సమాచారం. అప్పుడు కూడా చంద్రబాబు అతికష్టం మీద మీడియా ముందు వచ్చారని చెబుతున్నారు.
అనంతరం ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ ఒక్కసారిగా విలపించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న నేతలు.. ఆయన్ను సముదాయించేందుకు ప్రయత్నించారు. అయినా ఐదు నిమిషాల పాటు చంద్రబాబు కుమిలికుమిలి ఏడ్చారు. అధినేత అంతలా ఏడుస్తుండడం చూసి.. తెలుగు తమ్ముళ్లు డీలా పడిపోయారు. ఎన్ని కష్టాలొచ్చినా ధైర్యంగా ఉండే చంద్రబాబు ఇలా విలపించడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు.
తాను నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఇప్పుడు అసెంబ్లీలో గత రెండున్నరేళ్లుగా తనను అనరాని మాటలు ఎన్ని అంటున్నా భరించానని చంద్రబాబు తెలిపారు. చివరకు తన భార్య ప్రస్తావన సభలో తెచ్చి, ఆమె గురించి అసహ్యంగా మాట్లాడారని చెప్పారు.
ఆమె వ్యక్తిత్వాన్ని కించపర్చాలని చూశారని, ఏమిటీ దుర్మార్గం? అని ప్రశ్నించారు. రాజకీయ కక్షలు తీర్చుకోవడం కోసం ఇళ్లలో ఉన్న ఆడవాళ్ల పేర్లను తీసుకొస్తారా? అని చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య ఏనాడూ రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఆమెకు రాజకీయాలపై ఆసక్తి లేదని తెలిపారు.
ఎప్పుడైనా ప్రొటోకాల్ కోసం లేదా సంప్రదాయాల కోసం రావడం తప్ప.. బయటకు వచ్చేది కాదని చంద్రబాబు తెలిపారు. తమ పార్టీ నాయకులు కూడా చాలామంది ఆవిడకు తెలియదని, నా శ్రమ వెనుక ఆమె త్యాగం చాలా ఉందని చంద్రబాబు తెలిపారు.
చంద్రబాబు రెండు సందర్భాల్లో మాత్రమే కన్నీరు పెట్టుకున్నారని.. ఆ తర్వాత ఆయన ఏడ్చడం ఎప్పుడూ చూడలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఓ సారి బాబ్లీ ప్రాజెక్టు ఆందోళన సందర్భంగా అరెస్ట్ అయినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారని, తర్వాత ఎర్రన్నాయుడు మరణించినప్పుడు మాత్రమే కంటతడి పెట్టుకున్నారని గుర్తుచేస్తున్నారు. ఇంతలా ఆయన ఏడ్చడం ఎప్పుడూ చూడలేదని నేతలు చెబుతున్నారు.