Begin typing your search above and press return to search.
టీటీడీ పోస్టుకు కొత్త పేరు ఓకే చేసేసిన చంద్రబాబు!
By: Tupaki Desk | 17 May 2017 6:32 PM GMTఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాబోయే వారంలో తెలుగుదేశం పార్టీ నేతలకు శుభవార్తలు చెప్పనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కీలకమైన పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా అందరి దృష్టి పడిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ విషయంలో చంద్రబాబు అనూహ్యమైన నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. అత్యంత కీలకమైన టీటీడీ చైర్మన్‌గా వివాదారహితుడు, ప్రజలతో సత్సంబంధాలు, జాతీయ స్థాయిలో మంచి పేరున్న వ్యక్తిని ఎంపిక చేయాలని చంద్రబాబు భావిస్తున్నారట. ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఇతర పదవుల్లో ఉన్న వారిని టీటీడీ చైర్మన్‌గా నియమించేది లేదని ఇప్పటికే స్పష్టంచేసిన చంద్రబాబు ఈ పదవిలో బాగా అనుభవం ఉన్న వ్యక్తి కోసం అన్వేషిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. టీటీడీ ఈఓగా ఉత్తరాది రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ సింఘాల్‌ను నియమించినందున ధర్మకర్తల మండలి చైర్మన్‌గా తెలుగు వారిని అందునా సీనియర్‌ను ఎంపిక చేయాలన్న ప్రతిపాదనపై చంద్రబాబు చర్చోపచర్చలు జరుపుతున్నారు. ఇందుకోసం ఆయన ఇప్పటికే కొంతమంది అభ్యర్థిత్వాలను పరిశీలించినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.
ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో చంద్రబాబుకు ప్రత్యేకాధికారిగా పనిచేసి ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కళాశాల విద్యా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కె.లక్ష్మీనారాయణకు ఈ పదవి వరించేందుకు ఎక్కువగా అవకాశాలున్నట్టు తెలుస్తోంది. లక్ష్మీనారాయణను ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడకు ప్రత్యేకంగా పిలిపించుకుని మూడు దఫాలు ఆయనతో మంతనాలు జరిపినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం గా చేపట్టిన నైపుణ్యాభివృద్ధి సంస్థలో కీలక భూమిక పోషించి వందలాది ఉద్యోగాలు సృష్టించిన లక్ష్మీనారాయణను చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించినట్టు సమాచారం. వాస్తవానికి లక్ష్మీనారాయణను అధికారం చేపట్టిన తొలినాళ్ళలోనే తితిదే చైర్మన్‌గా ఎంపిక చేయాలని చంద్రబాబు భావించారు. అయితే అప్పటికే ఈ పదవిని చదలవాడ కృష్ణమూర్తికి ఇస్తానని చంద్రబాబు హామీనివ్వడంతో లక్ష్మీనారాయణకు ఈ అవకాశం దక్కకుండా పోయింది. పర్యాటకాభివృద్ధి సంస్థ లేదా ఢిల్లిలో ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా ఎంపిక చేస్తానని లక్ష్మీనారాయణకు చంద్రబాబు హామీ ఇచ్చారని అందుకు ఆయన ఆసక్తి కనబరచలేదని అప్పట్లో ప్రచారం జరిగింది. తాజా పరిణామాల నేపథ్యంలో లక్ష్మీనారాయణకు చాన్స్ ఖాయమని అంటున్నారు.
వీటితోపాటుగా ఖాళీ అయిన శాప్, ఇరవై సూత్రాల ఆర్థిక పథకం, ఢిల్లిలో ఏపీ ప్రత్యేక ప్రతినిధి పోస్టులను కూడా భర్తీ చేయాలన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చారని తెలుస్తోంది. శాప్ చైర్మన్‌గా ఉన్న పీఆర్ మోహన్, ఇరవై సూత్రాల చైర్మన్ సాయిబాబా పదవీకాలాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఢిల్లిలో ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త కంభంపాటి రామ్మోహనరావు పదవీకాలం ఎప్పుడో పూర్తయింది. ఈ పదవిలో ఎంపిక చేసేవారు కేంద్ర ప్రభుత్వంతో బాగా సంబంధాలు ఉన్నవారినే చూడాలని చంద్రబాబు భావించారు. కంభంపాటి పదవీకాలం పొడిగించాలని ఒక దశలో భావించినప్పటికీ రాష్ట్రానికి చెందిన ఓ కేంద్రమంత్రి ఇందుకు మోకాలొడ్డినట్టు తెదేపాలో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే సదరు కేంద్రమంత్రిని కాదని ఈ ప్రత్యేక ప్రతినిధి ఢిల్లిలో మంత్రులను, భాజపా సీనియర్ నేతలను కలుస్తున్నారని దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ మంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో కంభంపాటికి చుక్కెదురైంది. శాప్ చైర్మన్‌గా ఉన్న పీఆర్ మోహన్, ఇరవై సూత్రాల చైర్మన్ సాయిబాబా పదవీకా లాలను పొడిగించే అవకాశం లేదని తెలుస్తోంది. వీరిద్దరిని పార్టీ కార్యకలాపాలకు వినియోగించుకోవాలన్న నిర్ణయానికి చంద్రబా బు వచ్చారు. సాయిబాబా పదవీకాలం పొడిగింపు విషయంలో గుంటూరు జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత అడ్డుపడ్డట్టు ప్రచారం జరుగుతోంది. వచ్చే రెండేళ్ళు కీలకం కావడంతో పీఆర్ మోహన్ సేవలను పార్టీకి వినియోగించుకోవాలని చంద్రబాబు సంకల్పించారు.
టీటీడీ చైర్మన్ భర్తీతో పాటు పాలకమండలి సభ్యుల ఎంపికపై కూడా చంద్రబాబు దృష్టి సారించారు. ఈ దఫా తెలంగాణ ప్రాంతానికి చెందిన ముగ్గురికి తిరిగి అవకాశం ఉండవచ్చన్న ప్రచారం ఉంది. తెలంగాణ పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో సంప్రదింపులు జరిపాకే తితిదే పాలక మండలి సభ్యుల నియామకంపై చంద్రబాబు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాజకీయ ఒత్తిళ్ళకు ఏమాత్రం తలొగ్గకుండా చైర్మన్, పాలకమండలి సభ్యులను ఎంపిక చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన శేఖరరెడ్డిని పాలక మండలి సభ్యునిగా నియమించి తప్పు చేశామన్న భావన చంద్రబాబు మదిలో ఉంది. ఇటువంటివి తిరిగి పునరావృతం కాకుండా చూడాలని చంద్రబాబు అనుకుంటున్నారని, అందుకే చైర్మన్, పాలక మండలి సభ్యుల నియామకాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.