Begin typing your search above and press return to search.
ఈ ఫోన్ సర్వే గోలేంది చంద్రబాబు..?
By: Tupaki Desk | 16 Sep 2015 7:35 AM GMTఅందుబాటులోకి వచ్చిన సాంకేతికతను ఉపయోగించుకోవటం బాగానే ఉంటుంది. కానీ.. ఆ పేరు చెప్పి అవసరం లేని విషయాలకు అనవసర హడావుడి చేయటం ఏ మాత్రం బాగోదు. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వైఖరి చూస్తే ఇదే తీరులో ఉంది.
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మొబైల్ ఫోన్ లకు ఫోన్ ద్వారా.. ఆయా నియోజకవర్గాలకు చెందిన నేతల్లో ఎవరికి తెలుగుదేశం పార్టీ టిక్కెట్లు ఇవ్వాలంటూ టెలిఫోన్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా బోలెడంత కామెడీ చోటు చేసుకుంది. ఒక నియోజకవర్గం వారికి మరో నియోజకవర్గం ప్రజలకు ఫోన్ కాల్స్ వెళ్లటం.. కొన్ని సందర్భాల్లో తెలంగాణ వారికి ఏపీకి చెందిన ఫోన్ లు రావటం.. అదే రీతిలో ఏపీకి చెందిన వారికి తెలంగాణ ఫోన్ లు రావటం జరిగి.. తల పట్టుకునే పరిస్థితి.
ఈ సందర్భంగా బాబు చేపట్టిన ఈ టెలిఫోన్ ఎంపికపై బెలెడన్ని జోకులు పేలాయి. ఇదిలా ఉంటే తాజాగా.. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధినేతను ఎన్నుకునేందుకు మరోమారు ఫోన్ సర్వే నిర్వహిస్తున్నారు. 8333999999 నెంబరు నుంచి కాల్ రావటం.. ఫ్యాన్సీ నెంబరు నుంచి ఫోన్ కాల్ వచ్చిందే అని ఆసక్తిగా ఫోన్ తీసిన వారికి ప్రియమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభినందనలు అంటూ ఫోన్ కాల్ మొదలై.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించే నేత ఎవరో ఎన్నుకోవాలని అడుగుతున్నారు.
తెలుగు తమ్ముళ్లు చెప్పే మాటేమిటంటే.. ఐవీఆర్ఎస్ విధానంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నమోదు చేసుకునే వారికే ఈ ఫోన్ కాల్ వెళుతుందని చెప్పినా.. ఫోన్ నెంబర్లు మార్చేవారు.. లేదంటే.. సభ్యత్వ నమోదు సమయంలో అనుసరించే సిత్రాలతో పార్టీకి సంబంధం లేని పలువురికి ఫోన్లు వస్తున్నట్లుగా చెబుతున్నారు.
దీంతో.. వారు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. తాము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం ఎలా అవుతామని ఆశ్చర్యపోతున్నారు. అయినా.. ప్రజలు మెచ్చే నేత ఎవరో చంద్రబాబుకు తెలీదా? ప్రజలు చెబితేనే తెలుస్తుందా? నిజంగా అంత కమిట్ మెంట్ ఉంటే.. సార్వత్రిక ఎన్నికల సమయంలో జనాలు కోరుకున్న నేతల్లో ఎందరికి టిక్కెట్లు ఇచ్చారో తెలిసిందే. అలాంటప్పుడు ఈ హడావుడి కన్నా.. సమర్థుడైన నాయకుడ్ని ఎంపిక చేసి పదవీ బాధ్యతలు అప్పగించేదానికి ఇంత హడావుడి అవసరమా? అన్న మాట వినిపిస్తోంది. హైటెక్ ఆలోచనలు ఉండటం మంచిదే కానీ.. అందుకు తగ్గ అంశాలకు దాన్ని వినియోగిస్తే బాగుంటుంది. మరి.. బాబుకు ఈ విషయం ఎప్పటికి అర్థమవుతుందో..?