Begin typing your search above and press return to search.
బీజేపీ సాయం కోరనున్న చంద్రబాబు
By: Tupaki Desk | 17 Aug 2019 12:49 PM GMTఎన్నికలకు ముందు తెగతెంపులతో బీజేపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఎన్నికల్లో చంద్రబాబు దారుణ పరాజయం.. కేంద్రంలో బీజేపీ ఘన విజయంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. చంద్రబాబు పూర్తిగా డీలాపడిపోయారు. ఓటమి పాలైన చంద్రబాబును బీజేపీ వెంటాడడం మానేసినా ఏపీలో విజయం సాధించిన వైసీపీ మాత్రం తరుముతోంది. ఇప్పటికే చంద్రబాబు భద్రతను వైసీపీ తగ్గించడం.. దానిపై కోర్టుకు వెళ్లి మళ్లీ తన పూర్వస్థాయి భద్రతను చంద్రబాబు సాధించుకోవడం తెలిసిందే. తాజాగా కృష్ణానది వరదల నేపథ్యంలో మరోసారి చంద్రబాబు భద్రత చుట్టూ రాజకీయం నడుస్తోంది. కృష్ణానది కరకట్ట వద్ద ఉన్న లింగమనేని గెస్టుహౌస్ లో ఉండే చంద్రబాబు ఇంటిపై నుంచి డ్రోన్లు తిరగడం.. వాటిని రాష్ట్ర ప్రభుత్వం వరద అంచనాకు ఉపయోగించినట్లు చెప్పడం తెలిసిందే. అయితే... చంద్రబాబు మాత్రం డ్రోన్లతో ప్రభుత్వం నిఘా పెడుతోందని.. తన భద్రతకు ముప్పు ఉందని అంటున్నారు. దీనిపై ఎంతగా గొంతు చించుకుంటున్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చంద్రబాబు తన వైరాన్ని మరిచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
బాంబులను ఏర్పాటు చేసేందుకే డ్రోన్ లతో చంద్రబాబు నివాసాన్ని పరిశీలిస్తున్నారని టీడీపీ బహిరంగంగానే ఆరోపించింది. అయితే, టీడీపీ ప్రకటన వెలువడిన కొద్ది నిమిషాల్లోనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందన్న సమాచారంతో డ్రోన్ ల ద్వారా అంచనా వేసేందుకే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని స్పష్టం చేసింది. ఇందులో ఎటువంటి కుట్ర రాజకీయం లేదని పేర్కొంది. శుక్రవారం ఉదయానికే ప్రకాశం బ్యారేజి వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీచేయడం, ఆవెంటనే వరద ఉధృతి పెరగంతో చంద్రబాబు నివాసం వద్ద పరిస్థితిని సమీక్షించాల్సిన బాధ్యత తమపై ఉన్నందునే ఈ పనిచేయాల్సి వచ్చిందంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. టీడీపీ నాయకులు మాత్రం డ్రోన్ ల వ్యవహారంలో ఏదో కుట్ర దాగి ఉందని, బాబు నివాసంలో భధ్రతా వ్యవహారాలను డ్రోన్ ల ద్వారా పరిశీలించి ఏదో చేయాలన్న దురుద్దేశ్యంతోనే హైసెక్యూరీటీ జోన్ లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని టీడీపీ ఆరోపిస్తోంది.
హైసెక్యూరిటీ జోన్ లో ఉన్న తన నివాసం చుట్టూ డ్రోన్ ను ఉపయోగించడంపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు ఇదే విషయాన్ని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే, శుక్రవారం సాయంత్రానికి ఈ వ్యవహారం పలు మలుపులు తిరగడంతో ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రభుత్వం తనను నేరుగా ఎదుర్కోలేక వరద ముంపు పేరుతో డ్రోన్ లతో కుట్ర పన్నుతోందని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించి, కేంద్ర ప్రభుత్వ సంస్థతో విచారణ జరిపించాలని కోరాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలియవచ్చింది. మరి కేంద్రం చంద్రబాబుకు ఈ విషయంలో ఎంతవరకు అండగా ఉంటుందో చూడాలి.