Begin typing your search above and press return to search.
ఓటుకు నోటు కేసులో బుక్కైన చంద్రబాబు.. సుప్రీం గ్రీన్ సిగ్నల్?
By: Tupaki Desk | 17 Dec 2020 9:57 AM GMTఎన్నికల్లో ఓటు వేయాల్సిందిగా 2015లో తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను టీడీపీ నాయకులు ప్రలోభపెట్టి 50 లక్షలను ఎరగా వేసిన ‘ఓటుకు నోటు’ కేసు తాజాగా భారీ మలుపు తిరిగింది. ఈ కేసును తెలంగాణ ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి అనుచరుడు అయిన ఉదయ్ సింహాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఉదయ్ సింహా ఏ3గా ఉన్నారు. ఈ అరెస్ట్ కలకలం రేపిన నాడే సుప్రీం కోర్టులో మరో సంచలనం నమోదైంది.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ప్రమేయంపై పెద్ద ఎత్తున నాడు వార్తలు మీడియాలో వచ్చాయి. ఆయన ఆడియోలు వైరల్ అయ్యాయి. దీనిపై ఏపీలోని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చంద్రబాబు పాత్రను ఈ కేసులో తేల్చేందుకు విచారణ జరిపించాలని కోరారు.
చంద్రబాబు పేరు పలుమార్లు ప్రస్తావనకు వచ్చినప్పటికీ నిందితుడిగా చేర్చలేదని.. ఆయన్ను కనీసం ప్రశ్నించలేదని ఎమ్మెల్యే ఆర్కే తరుఫున వాదనలు వినిపించారు. ఈ వాదనతో సుప్రీం ధర్మాసనం ఏకీభవించింది.
ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటీషన్ పై సంచలన నిర్ణయం తీసుకుంది.. చంద్రబాబు పేరును ఓటుకు నోటు కేసులో చేర్చాలని.. ఆయన పాత్రను తేల్చేందుకు విచారణ జరిపించాలని నిర్ణయించింది. అయితే విచారణను మాత్రం వచ్చే ఏడాది జూలైకి వాయిదా వేసింది.
ఈరోజు నుంచే ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు అరెస్ట్ లు మొదలుపెట్టిన వేళ.. సుప్రీంకోర్టులో చంద్రబాబును విచారించాలన్న పిటీషన్ విచారణకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.