Begin typing your search above and press return to search.
టీడీపీని బాబు కంట్రోల్ చేయలేక పోతున్నారా?
By: Tupaki Desk | 27 Sep 2021 3:19 AM GMTఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీని పెద్ద సమస్య వెంటాడుతోంది. ఒకవైపు ప్రభుత్వ పార్టీ నుంచి వస్తున్న ఒత్తిళ్లు.. పైచేయి.. ప్రజల్లో అధికార పార్టీ పుంజుకుంటున్న తీరు.. టీడీపీని ఎక్కడికక్కడ నిలువరి స్తున్న విధానం వంటివి.. టీడీపీని కలవరపెడుతున్నాయి. ఈ క్రమంలో పార్టీని మళ్లీ గాడిలో పెట్టి.. వచ్చే ఎన్నికల్లో గెలిపించుకునేందుకు చంద్రబాబు ఆపశోపాలు పడుతున్న విషయం తెలిసిందే. గత 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పొందింది. అప్పటి వరకు పల్లకీలు మోసిన నాయకులు.. చంద్రబాబు ను ఇంటా బయటా కొనియాడిన నేతలు.. కూడా దూరమయ్యారు.
వీరందరినీ దగ్గర చేసుకోవడం.. పార్టీని నడిపించడం.. చంద్రబాబు కత్తిమీద సాములా మారింది. పైగా కరో నా ఎఫెక్ట్‌తో బయటకు రాలేక ఏడాది సమయం వృధా అయింది. ఇప్పుడిప్పుడే.. మళ్లీ పార్టీ పుంజుకుం టున్న క్రమంలో మళ్లీ చంద్రబాబుకు తలనొప్పులు ప్రారంభమయ్యాయి. ఇటీవలే.. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. వ్యూహాత్మక వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానంటూ.. బాంబు పేల్చారు. దీంతో ఒక్కసారిగా పార్టీలో కలకలం రేగింది. అయితే.. ఆయనను వెంటనే బుజ్జగించడంతో పార్టీలో లుకలుకలు తగ్గాయని అనుకున్నారు.
కానీ, ఇంతలోనే.. మళ్లీ విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎపిసోడ్ తెరమీదికి వచ్చింది. విజయవాడ టీడీపీ లో తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటున్న నాని.. అందరికీ దూరంగా రాజకీయాలు చేసుకుంటున్నారు. ఇటీ వల చంద్రబాబు ఇంటిపై వైసీపీ నాయకులు దాడి చేసిన ఘటనపై ఇప్పటి వరకు ఆయన స్పందించలే దు. దీనిపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ సమయంలో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని.. కేశినేని నాని స్పష్టం చేయడం.. తన కుమార్తె కూడా పార్టీ తరఫున పోటీకి రెడీ కాదని.. సంకేతాలు పంపం డం .. మరోసారి టీడీపీ నేతల పై అదుపు లేదనే కామెంట్లు వచ్చేందుకు అవకాశం కల్పించినట్టయింది.
ఇక, రెండు రోజుల కిందటే.. గుంటూరు జిల్లా మంగళగిరిలో మంచి పట్టున్న నాయకుడు, ఆప్కో.. చైర్మన్.. మురుగుడు హనుమంతరావు కూడా పార్టీకి దూరమయ్యారు. ఇక,ఉత్తరాంధ్రలో పట్టున్న నాయకులు కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుది .. ఎంతకూ అర్ధంకాని.. విషయంగా మారింది. ఆయన పార్టీలో ఉన్నారో.. లేరో తెలియదు. మరోపక్క పార్టీలో గతంలో కీలక నేతగా వ్యవహరించిన ఎంతో మంది నేతలు ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు. ఇప్పటికే జేసీ దివాకర్ రెడ్డి, గల్లా అరుణకుమారిలు యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు.
మాజీ మంత్రి, చంద్రబాబుకు అప్పట్లో రైట్ హ్యాండ్‌గా వ్యవహరించిన పొంగూరు నారాయణ పరిస్థితి కూడా అర్ధం కావడం లేదు. మరోవైపు.. ఒకప్పుడు చంద్రబాబు గీత దాటని నేతలు, ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వెళుతున్నారు. అదేసమయంలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ వంటి నాయకులు చంద్రబాబు పై, లోకేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసి మరీ వెళ్లారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న వారంతా కొందరు పార్టీలో సీనియర్ నేతల తీరు, తమను చంద్రబాబు పట్టించుకోవడం లేదన్న కారణంగా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.
మరి ఇలాంటి పరిస్థితి నుంచి పార్టీని ఎలా బయట పడేస్తారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇక, ఇప్పటికే పార్టీలో ఉన్న నాయకులు కూడా ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. నేతల మధ్య సఖ్యత కనిపించడం లేదు. కొందరు రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్నారు. మరి ఈ పరిస్థితిని దాటుకుని పార్టీని చంద్రబాబు గాడిలో పెట్టడం.. ముఖ్యంగా నారా లోకేష్‌ను బలమైన నాయకుడిగా ప్రొజెక్టు చేయడం అనేది.. ఇప్పుడు పెను సవాల్‌గా మారింది. అయితే.. చిత్రం ఏంటంటే.. ఎప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నా.. ఇలాంటి ఆటుపోట్లు సర్వసాధారణంగా మారడం గమనార్హం.