Begin typing your search above and press return to search.
నాడు రంగా ఇంట్లోకి ఎన్టీఆర్ కు నో ఎంట్రీ.. నేడు బాబుకు స్వాగతం
By: Tupaki Desk | 2 Jan 2022 9:02 AM GMTఏపీలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. కులాల సమీకరణమైన ఆ రాష్ట్రంలో ఎవరికి వారు ప్రయత్నాల్లో ఉన్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను కలిశారు. రాధా ఇంటికి వెళ్లి మరీ ఆయనతో సమావేశమయ్యారు. రాధాతో చంద్రబాబు భేటీ అయిన సమయంలో రాధా తల్లి రత్నకుమారి కూడా ఉన్నారు. ఇందులో విశేషమేముంది..? రాధాకృష్ణ ఎలాగూ టీడీపీలో ఉన్నారు కదా..? గత ఎన్నికల సమయంలో ఎన్ని విమర్శలు వచ్చినా టీడీపీలో చేరిన ఆయనను పార్టీ అధినేత చంద్రబాబు కలవడంలో తప్పేముందంటారా? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.. అదేంటో చదవండి..
ఆ అల్లకల్లోలంలో ఎన్టీఆర్ కు చేదు అనుభవం
సరిగ్గా 33 సంవత్సరాల క్రితం 1988 డిసెంబరు 26న విజయవాడ నడిబొడ్డున అప్పటి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా దారుణ హత్యకు గురయ్యారు. పేద వర్గాల నాయకుడిగా పేరున్న రంగా కేవలం నాలుగేళ్ల ఎమ్మెల్యే గిరీలోనే ఉమ్మడి ఏపీలో అనూహ్య ప్రజాదరణ పొందారు. ఆయన పిలుపిస్తే లక్షలాదిగా ప్రజల తరలివచ్చేవారు. రంగాకు నాడు సినిమా హీరోను మించిన ఇమేజ్ ఉండేదని రాజమండ్రి మాజీ ఎంపీ, ఆయన సహచరుడు ఉండవల్లి అరుణ్ కుమార్ పలుసార్లు చెప్పారు. అలాంటి రంగా.. నాడు బలంగా ఉన్న ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని తరచూ ప్రజాందోళనలతో ఇరుకున పెట్టేవారు. దీనికితోడు విజయవాడ రాజకీయాల్లో ఆయన ప్రత్యర్థి దేవినేని
నెహ్రూతో బద్ధ శత్రుత్వం ఉండేది. ఈ నేపథ్యంలో దాడులు, హత్యల పరంపర చోటుచేసుకునేది. చివరకు నిరాహార దీక్షలో ఉన్న రంగా దారుణ హత్య అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. అప్పటికే రంగాకు ప్రజల్లో విపరీత ఆదరణ ఉండడంతో.. ఆయన హత్య అనంతరం పరిణామాలు చేయిదాటాయి. విజయవాడ అల్లకల్లోలమైంది. ఏపీలో రోజుల కొద్దీ తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. చివరకు విజయవాడలో సైన్యాన్ని దించి పరిస్థితులు అదుపు చేశారు. కాగా, వంగవీటి రంగా హత్యానంతరం.. ఆయన ఇంటికి వెళ్లి రంగా భార్య రత్నకుమారిని పరామర్శించాలని నాటి సీఎం ఎన్టీఆర్ సంకల్పించారు. కానీ, ఉద్రిక్త పరిస్థితుల రీత్యా అందుకు ఏమాత్రం అవకాశం లేకపోయింది.
చాలామంది వారించినా.. రంగా ఇంటికి వెళ్లేందుకే సిద్ధమైన ఎన్టీఆర్ చివరకు తన ప్రయత్నం ఫలించకుండానే వెనుదిరిగారు. విజయవాడ వచ్చి.. రంగా ఇంటి ఎదుట కారు దిగి పై అంతస్తులోకి వెళ్లేందుకు ప్రయత్నించింనా రంగా అభిమానులు అడ్డుకోవడంతో పైకి వెళ్లలేకపోయారు. ఎన్టీఆర్ ఐదు నిమిషాలు వేచి చూసినా రంగా అభిమానులు ఆయనను ముందుకు కదలనీయలేదు. అలా.. రంగా ఇంటి వద్ద ఎన్టీఆర్ కు చేదు అనుభవం ఎదురైంది.
నేడు బాబుకు మాత్రం రాచబాట
రంగా హత్య అనంతరం రాష్ట్రం అట్టుడికింది. తర్వాతి ఎన్నికల్లో ఇదే ప్రధానాంశమైంది. టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. రంగా భార్య రత్నకుమారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే, తర్వాతి కాలంలో ఉద్రిక్తతలు క్రమంగా తగ్గాయి. రంగా హత్య కేసు నిందితుల్లో ఒకరైన దేవినేని వెంకటరమణ 1999లో జరిగిన రైలు ప్రమాదంలో చనిపోవడం, ఆ తర్వాత కేసులో తీర్పు వెలువడడం జరిగిపోయాయి. ఇక రంగా వారసుడిగా 2004లో రాజకీయాల్లోకి వచ్చి 26 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యే అయ్యారు రాధా. అనంతరం రాజకీయ పరిణామాల్లో మార్పుతో ఆయన కొంత వెనుకబడినా.. ఇప్పటికీ ప్రజాదరణ చెక్కుచెదరలేదు. అయితే, 2019 వరకు వైఎస్సార్ సీపీలో ఉన్నఆయన ఎన్నికలకు ముందు అనూహ్యంగా టీడీపీలో చేరి ఆశ్చర్యపరిచారు. ఆ ఎన్నికల్లో టీడీపీ గెలవకపోవడంతో రాధాకు తదనంతరం పదవి దక్కలేదు. ఇదంతా వదిలేస్తే.. ఇటీవల తనకు హత్యకు ప్రయత్నాలు జరిగాయంటూ రాధా ప్రకటన చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనం
రేపింది. దీంతో ఆయనకు మద్దతుగా మాట్లాడడం మొదలైంది. టీడీపీ సైతం దీనిపై స్పందించింది. దీనివెనుక ఉన్నదెవరో తేల్చాలంటూ డిమాండ్లు మొదలయ్యాయి. చంద్రబాబు అంతకుముందు మీడియా చిట్ చాట్ లోనూ రాధాకు మద్దతుగా మాట్లాడారు. సీఎం జగన్ రాధాకు భద్రత పెంచుతూ డీజీపీకి ఆదేశాలిచ్చారు. కాగా, రాజకీయంగా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ.. శనివారం చంద్రబాబు ఏకంగా రాధా ఇంటికి వెళ్లి పరామర్శించారు. అంటే.. రంగా హత్యానంతరం అప్పట్లో ఎన్టీఆర్ కు సాధ్యం కానిది 33 ఏళ్లకు చంద్రబాబుకు సాధ్యమైంది అన్నమాట. ఏదేమైనా.. రాజకీయంగా చాణక్యుడైన చంద్రబాబు దీని ద్వారా మరో సందేశమూ పంపారు. రంగా హత్యలో
బాబుకూ పాత్ర ఉందనే ఆరోపణలు ఇంత కాలం ఉన్నాయి. రాధా టీడీపీలో చేరిన సందర్భంలో ఈ ఆరోపణలను ఖండించినా.. అది వేరే సంగతి. ఇప్పటికీ రంగా అభిమానులు చంద్రబాబు పాత్రను అనుమానిస్తుంటారు. తాజాగా రాధా తన హత్యకు కుట్ర ఆరోపణలు చేయడంతో ఆ అవసరం ఎవరికి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. దాదాపు 25 శాతం ఓట్లు ఉన్న సామాజిక వర్గానికి చెందిన రాధా ఆరోపణలను తేలిగ్గా కొట్టి పారేసే పరిస్థితి లేని నేపథ్యంలో వైసీపీ, టీడీపీ రెండూ ఉలిక్కిపడ్డాయి. అందుకే.. తన మీద ఉన్న మచ్చను చెరిపేసుకోవడానికి బాబు ప్రయత్నించారు. రాధాను పరామర్శించడం ద్వారా తమ మద్దతు ఆయనకు ఉందని చెప్పారు.