Begin typing your search above and press return to search.
మహిళా కమిషన్ ముందు హాజరుకాని చంద్రబాబు.. పోలీసులకు ఫిర్యాదు
By: Tupaki Desk | 27 April 2022 11:35 AM GMTవిజయవాడ ప్రబుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకున్న మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారణ ఘటన.. అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో ఒకేసారి.. బాధి తురాలిని పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్.. వాసిరెడ్డి పద్మల మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటుసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ నాయకుడు... బొండా ఉమా కూడా వాసిరెడ్డి పద్మపై నోరు పారేసుకున్నారని.. ఆమె ఆరోపించారు.
ఈ క్రమంలోనే ఈ నెల 27(బుధవారం)న వచ్చి వివరణ ఇవ్వాలని మహిళా కమిషన్ చంద్రబాబుకు, బొండా ఉమాకు.. నోటీసులు ఇచ్చారు. అయితే.. వారిద్దరూ హాజరుకాలేదు. అంతేకాదు.. తెలుగు మహిళ అధ్యక్షురాలు.. మాజీ ఎమ్మెల్యే.. వంగలపూడి అని మహిలా కమిషన్‌కువచ్చి.. వాసిరెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఈ వివాదం.. తీవ్రస్తాయికి చేరింది. మరోవైపు.. కమిషన్ సభ్యురాలు..పుణ్యశీల.. మాజీ ఎమ్మెల్యే.. బొండాపై ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదుచేశారు. దీంతో ఈ విషయం మరింత రసకందాయంగా మారింది.
అంతకు ముందు మంగళగిరి మహిళా కమిషన్ కార్యాలయాన్ని తెలుగు మహిళలు, వంగలపూడి అనిత ముట్టడించడానికి యత్నించారు. విజయవాడ అత్యాచార బాధితురాలి కుటుంబసభ్యులను కలిసి టీడీపీ మహిళా నేతలు.. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ చాంబర్‌కు వెళ్లి బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అయితే అక్కడితో ఆగకుండా ఆమె చాంబర్‌లో వాసిరెడ్డి పద్మతో టీడీపీ మహిళా నేతలు వాగ్వాదానికి దిగడం తీవ్ర వివాదానికి దారితీసింది.
ఇక, ఈ ఘటనపై మాట్లాడిన వాసిరెడ్డి పద్మ.. టీడీపీపై విరుచుకుపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేత బోండా ఉమాకు నోటీసులు ఇచ్చామని, హాజరు కాకుండా.. తాము ఇచ్చిన నోటీసు లకు నిరసనగా టీడీపీ మహిళలతో ధర్నాలు చేయిస్తోందని మండిపడ్డారు. మహిళా కమిషన్‌ను చంద్రబాబు గౌరవిస్తారని అందరూ భావించారు. కానీ, అలా జరగలేదన్నారు. మహిళల పట్ల ఎలా వ్యవహరించాలని చెప్పడానికే నోటీసులు ఇచ్చామని తెలిపారు.
ఇవాళ ధర్నాలకు పిలుపునివ్వడం, మహిళా కమిషన్ దగ్గర ఆందోళన చేయడం సరికాదని వాసిరెడ్డి పద్మ హితవు పలికారు. హాస్పిటల్‌లో నైతిక విలువలు లేకుండా ప్రవర్తించారని మండిపడ్డారు. అత్యాచార బాధితుల పట్ల ఎలా ఉండాలనేది చెప్పాలనుకున్నామని తెలిపారు. చంద్రబాబు, బోండా ఉమా చేసిన తప్పులు ఏంటో మీడియా ద్వారా చెప్తున్నామని అన్నారు. చంద్రబాబు, ఆయన అనుచరులవి పది తప్పులు ఉన్నాయని ఆమె మీడియాకు వివరించారు.
పది తప్పులు ..
+ పదుల సంఖ్యలో బాధితురాలి దగ్గరికి వెళ్లడం
+ గుంపులుగా వచ్చి గట్టిగా అరవడం
+ బాధితురాలిని భయకంపితులు చేయడం
+ సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మంది మార్బలంతో వచ్చారు
+ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ను అడ్డుకోవడం
+ తనను పరామర్శ చేయకుండా అడ్డుకోవడం
+ తనను బెదిరించడం, విధులను అడ్డుకోవడం
+ చంద్రబాబు వ్యక్తిగతంగా నన్ను బెదిరించడం
+ బోండా ఉమా అనుచిత పదజాలంతో దూషించడం
+ కుటుంబ సభ్యులను మీడియా ముందుకు తిప్పడం