Begin typing your search above and press return to search.

చంద్రబాబు రావద్దట.. కేసీఆర్ ఏపీకి పోవచ్చట.. ఇదేం విడ్డూరం

By:  Tupaki Desk   |   21 Oct 2022 5:16 AM GMT
చంద్రబాబు రావద్దట.. కేసీఆర్ ఏపీకి పోవచ్చట.. ఇదేం విడ్డూరం
X
ఓట్ల కోసం విద్వేష రాజకీయాలు చేసి సంపాదించుకోవడం తెలుగు నాట ఎప్పటి నుంచో ఉంది.తెలంగాణ ఉద్యమ సమయంలో 'ఆంధ్రోళ్లు', ఆంధ్రా లీడర్లు తెలంగాణను దోచుకుంటున్నారని కేసీఆర్ ఆరోపించి బలపడ్డారు. 2018 ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే చంద్రబాబును బూచీగా చూపే సెంటిమెంట్ రాజేసి కేసీఆర్ రెండో సారి అధికారంలోకి రాగలిగారు.

ఇప్పుడు కూడా మునుగోడు వేళ కేసీఆర్ అదే అస్త్రాన్ని బయటకు తీస్తున్నారు. చంద్రబాబు, బీజేపీకి సపోర్టుగా మునుగోడులో ప్రచారానికి వస్తున్నారని.. ఆంధ్రా పార్టీతో బీజేపీ కలిసిందని ప్రచారం మొదలుపెట్టారు.

2018 తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ దారుణ ఓటమి తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే తెలంగాణలో చంద్రబాబు ప్రత్యక్షమవుతారనే తొలి అభిప్రాయంలో ఆయనపై టీఆర్ఎస్ మౌత్ పీస్ ఆరోపణలకు దిగడం చర్చనీయాంశమైంది.

మునుగోడు బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టిడిపి హైకమాండ్‌ను సంప్రదించి ఎన్నికల ప్రచారంలో మద్దతు కోరినట్లు సమాచారం. ఆ తర్వాత మునుగోడులో కోమటిరెడ్డికి ప్రచారం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారట.. ఏం జరుగుతుందో పసిగట్టిన టీఆర్‌ఎస్‌ మౌత్‌పీస్ నమస్తే తెలంగాణ, తెలంగాణలోని మునుగోడు ఓటర్లను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చంద్రబాబు నాయుడు ఎలా ప్రభావితం చేయబోతున్నారనే దానిపై ఓ పెద్ద కథనం చేసింది. తెలంగాణ ఓటర్లను మోసం చేసేందుకు టిడిపి, బిజెపిలు ప్రయత్నిస్తున్నాయని చంద్రబాబు వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించారు.

అయితే ఇక్కడ విడ్డూరం ఏంటంటే.. కేసీఆర్ స్వయంగా జాతీయ పార్టీ అయిన బీఆర్‌ఎస్‌ను తెరపైకి తెచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఆంధ్రప్రదేశ్‌లో పర్యటనకు ప్లాన్ చేశారు. ఏపీలో పొత్తులకు యోచిస్తున్నారు. ఏపీలో ప్రచారం చేసి ఓట్లు అడగడానికి రెడీ అయ్యారు.

కానీ పక్క రాష్ట్రం పార్టీ అధినేత చంద్రబాబు తెలంగాణ వస్తే మాత్రం టీఆర్‌ఎస్‌కు పెద్ద సమస్యగా కనిపిస్తోంది. కానీ వారి సొంత కేసీఆర్ జాతీయ పార్టీని స్థాపించి దేశవ్యాప్తంగా.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా పోటీ చేయవచ్చు. కేసీఆర్ భారతదేశంలో ఎక్కడికైనా వెళ్లవచ్చు కానీ చంద్రబాబు తెలంగాణకు రాకూడదు. ఇది ఏ విడ్డూరం?" అని పలువురు ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.