Begin typing your search above and press return to search.
చంద్రబాబు చార్మినార్ కట్టానన్నా ఆశ్చర్యం లేదట!
By: Tupaki Desk | 5 Sep 2018 10:13 AM GMTహైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టడం.. ప్రముఖులెందరికో నోబెల్ - ఆస్కార్ లు ఇప్పించడం - సత్య నాదెళ్లకు ఇంజనీరింగ్ సలహాలు ఇవ్వడం - పీవీ సింధు చేత షటిల్ రాకెట్ పట్టించడం - పుట్టక ముందే నిజాంతో దోస్తీ చేసి బేగంపేట విమానాశ్రయాన్ని కట్టించడం... బ్రిటిష్ వారిపై పోరాడిన తెలుగుదేశం పార్టీ కీర్తిని ఇనుమడింపజేయడం..... అలెగ్జాండర్ గారిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేయడం.....అబ్బో...ఒకటా రెండా....ఇలా నారా వారి ఘన చరిత్ర చెప్పుకుంటూ పోతే కొండవీడు చాంతాడంత అవుతుంది. ఇక, నారా వారి రాజకీయ వారసుడి ఘనకీర్తి గురించి చెప్పడం మొదలు పెడితే అదో మ`హా`స్య కావ్యమవుతుంది. నారా తండ్రీకొడులు...ఏదోరకంగా ఏపీ ప్రజలను ఎంటర్ టైన్ చేయడానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై రాజ్యసభ ఎంపీ కేవీపీ రాంచంద్రరావు షాకింగ్ కామెంట్స్ చేశారు. అసత్యాలు చెబుతూ ప్రజలను చంద్రబాబు మభ్యపెడుతున్నాడని, అవసరమైతే చార్మినార్ కూడా తానే కట్టానని చెబుతాడని ఎద్దేవా చేశారు.
పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు చెబుతోన్న విషయాలు అవాస్తవమని కేవీపీ స్పష్టం చేశారు. పోలవరం కోసం కాంగ్రెస్ అన్ని అనుమతులు ఇచ్చిందని - ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లిందీ కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపాఆరు. పోలవరాన్ని ఎప్పటికి పూర్తి చేస్తారో చంద్రబాబు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని విమర్శించారు. పోలవరంపై చంద్రబాబు చెబుతున్న అసత్యాలు తాత్కాలిక ప్రయోజనాల కోసమేనని విమర్శించారు. అది తెలియకుండా పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు చెబుతున్న విషయాలను ఏపీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ సమర్థిస్తున్నారని మండిపడ్డారు. ఆయన వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. వాస్తవాలు తెలుసుకునేందుకే కోడెలకు 28 ప్రశ్నలతో ఓ లేఖ రాశానని, కానీ అసత్యాలతో వాటికి కోడెల బదులిచ్చారని వెల్లడించారు. వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వ గణాంకాలే కోడెల చెబుతున్నారని ధ్వజమెత్తారు. పోలవరం అంటే హెడ్ వర్క్స్ మాత్రమే కాదని, ఆ విషయం కోడెల తెలుసుకోవాలని చెప్పారు.