Begin typing your search above and press return to search.

వరద బాధితుల కన్నీళ్లు తుడిచిన చంద్రబాబు.. ప్రభుత్వ హత్యలంతూ ఫైర్

By:  Tupaki Desk   |   23 Nov 2021 2:18 PM GMT
వరద బాధితుల కన్నీళ్లు తుడిచిన చంద్రబాబు.. ప్రభుత్వ హత్యలంతూ ఫైర్
X
ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా కడప, చిత్తూరు జిల్లాల్లో చంద్రబాబు బాధితుల కష్టాలు తెలుసుకుంటున్నారు.ముందుగా కడప జిల్లా రాజంపేట, నందలూరు మండలాల్లోని చెయ్యరు నదీ పరివాహక ముంపు గ్రామాల్లో వరద బాధితులను చంద్రబాబు పరామర్శించారు. పులపత్తూరు, మందలపల్లి, గుండ్లూరు, తొగురుపేట గ్రామాల్లో తిరిగి బాధితుల కష్టాలు తెలుసుకుంటున్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వంపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. వరద బాధితుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని అన్నారు. అన్నమయ్య డ్యాం ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డంకిగా మారుతుందనే ప్రాజెక్టు గేట్లు ఎత్తలేదన్నారు. ముంపు విపత్తుకు స్థానిక ఇసుక మాఫియానే కారణమని.. వరద బాధితుల మరణాలన్నీ ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనన్నారు.

ఈఘటనకు సీఎం జగన్ బాధ్యత వహించాలని.. చేతకాకపోతే స్వచ్ఛందంగా తప్పుకోవాలని చంద్రబాబు అన్నారు. ప్రజల ప్రాణాలతో ఆటలొద్దు అని హితవు పలికారు. మంత్రులు, అధికార వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని అన్నారు.

వరద ముప్పు నుంచి అప్రమత్తం చేయలేని సీఎం.. ఆ పదవికి అనర్హుడంటూ నిప్పులు చెరిగారు. అన్నమయ్య డ్యాం నిర్వహణపై జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణ లోపమే ఈ విపత్తుకు చంద్రబాబు కారణమన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ పోరాడుతానన్నారు చంద్రబాబు.

అనంతరం పర్యటన ముగించుకున్న చంద్రబాబు.. ముంపు ప్రాంతాల బాధితులతో మాట్లాడారు. ఆటోనగర్, లక్ష్మీపురం సర్కిల్, ఎంఆర్ పల్లి సర్కిల్ దుర్గానగర్, గాయత్రినగర్, కృష్ణనగర్ జనాల కష్టాలు వింటారు.తర్వాత పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. రాత్రి రేణిగుంటలో బస చేయనున్న చంద్రబాబు బుధవారం ఉదయం చంద్రగిరి నియోజకవర్గంలో పర్యటిస్తారు.