Begin typing your search above and press return to search.

కుప్పంలో జగన్ తో చంద్రబాబు...?

By:  Tupaki Desk   |   9 Sep 2022 11:30 PM GMT
కుప్పంలో జగన్ తో చంద్రబాబు...?
X
కుప్పం అన్నది చంద్రబాబు సొంత నియోజకవర్గం. అక్కడ ఆయన ఏడు సార్లు గెలిచారు. 1989 నుంచి బాబు కుప్పాన్నే నమ్ముకున్నారు. ఇక 2024లో కూడా బాబు కుప్పం నుంచే బరిలోకి దిగుతారు. అలాంటొ చోట బాబుని ఓడగొట్టాలని వైసీపీ భారీ స్కెచ్ గీస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక కుప్పం మీద ఫుల్ ఫోకస్ పెట్టింది.

ఈ నేపధ్యంలో ఈ నెల 22న జగన్ కుప్పం టూర్ పెట్టుకున్నారు. కుప్పంలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అయితే కుప్పం టూర్ లో జగన్ తో పాటు బాబు కనిపిస్తారా అన్నదే చర్చగా ఉంది. చంద్రబాబు కుప్పం లోకల్ ఎమ్మెల్యే.

ప్రోటోకాల్ ప్రకారం చూస్తే సీఎం పాల్గొనే సభలలో ఆయనకు కచ్చితంగా ఆహ్వానం పంపించాలి. ఈ విషయంలో ఎలాంటి తేడా పాడాలు చేయకూడదు. అందుకే జగన్ కుప్పం టూర్ సందర్భంగా జరిగే కార్యక్రమాలలో పాలుపంచుకోవడానికి చంద్రబాబుకు కూడా ఇన్విటేషన్ పంపడానికి అధికారులు రెడీ అవుతున్నారు.

అయితే బాబు వస్తారా అంటే జవాబు డెడ్ ఈజీ. ఆయన అసలు రారు. ఉప్పూ నిప్పులా వైసీపీ టీడీపీల మధ్య రిలేషన్స్ ఉన్న టైం లో బాబు రావడం అన్నది కలలో మాట. ఆ విషయానికి వస్తే చంద్రబాబు సీఎం గా ఉండగా పులివెందులలో అనేక సార్లు పర్యటించారు. మరి నాడు బాబు సభలలో లోకల్ ఎమ్మెల్యేగా ఎక్కడా జగన్ కనిపించలేదు. ఆయనకు కూడా నాడు ఆహ్వానం పంపారా అన్నది పక్కన పెడితే ప్రోటోకాల్ ప్రకారం అలా చేసి తీరాలి.

ఇపుడు కూడా చంద్రబాబుకు అధికారులు కచ్చితంగా ఆహ్వానం ఇస్తారని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే 66 కోట్ల రూపాయలతో జగన్ కుప్పంలో పలు కార్యక్రమాలను మొదలెడతారు అని అంటున్నారు. ఈ సందర్భంగా కుప్పం నుంచే అనేక వరాలు కూడా ప్రజలకు ఇస్తారని చెబుతున్నారు. కుప్పం రా తేల్చుకుందామని ఈ మధ్యనే జగన్ కి బాబు సవాల్ చేసిన నేపధ్యంలో నెల తిరగకుండానే సీఎం టూర్ వేస్తున్నారు. మొత్తానికి రాజకీయంగా ఇంటెరెస్టింగ్ గానే ఈ టూర్ ఉండబోతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.