Begin typing your search above and press return to search.
రోజాపై చంద్రబాబుకు చిర్రెత్తుకొచ్చింది
By: Tupaki Desk | 18 Dec 2015 11:50 AM GMTకాల్ మనీ వ్యవహారం ఏపీ అసెంబ్లీని శుక్రవారం ఓ కుదుపు కుదిపేసింది. కాల్ మనీ మ్యాటర్ పై చంద్రబాబు మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించిన నిందితుల్లో ఏ పార్టీకి చెందిన వారు ఎంతమంది ఉన్నారో ప్రకటన చేస్తుండగా నగరి వైకాపా ఎమ్మెల్యే రోజా ఆయన ప్రసంగానికి పదే పదే అడ్డు తగలడంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. బాబు మాట్లాడుతుండగా రోజా ‘కాల్ మనీ చంద్రబాబు డౌన్ డౌన్’ అంటూ పదే పదే నినాదాలు చేస్తూ ఆయన ప్రసంగానికి ఆటంకం కలిగించింది. దీంతో చంద్రబాబు మాట్లాడుతూ రోజా అసలు ఓ మహిళా...ఆమె మాట్లాడే మాటల్లో సభ్యత ఉందా...రోజా అసలు ఆడదేనా అని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
రోజా మాటల్లో అస్సలు సంస్కారం లేదని...ఆమె సభ్యత - సంస్కారం వెంటనే నేర్చుకోవాలని చంద్రబాబు సూచించారు. దీంతో వెంటనే రోజా నేతృత్వంలో వైకాపా సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత కూడా రోజా వ్యాఖ్యలపై పలువురు టీడీపీ నాయకులు మండిపడ్డారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడుతూ రోజా మాటలు ఆమె హీన సంస్కారాన్ని సూచిస్తున్నాయన్నారు.
విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ అసెంబ్లీలో రోజా వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబును కించపరుస్తూ రోజా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇక మహిళగా రోజా చేస్తున్న వ్యాఖ్యలు అత్యంత హేయమని...ఆమెను సభ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేయాలని ఆమె స్పీకర్ కోడెలకు విజ్ఞప్తి చేశారు.