Begin typing your search above and press return to search.

వేలల్లో ఆదాయం ..కోట్లల్లో ఆస్తులు .. ఏందయ్యా చంద్రబాబు !

By:  Tupaki Desk   |   25 Jan 2020 7:33 AM GMT
వేలల్లో ఆదాయం ..కోట్లల్లో ఆస్తులు .. ఏందయ్యా చంద్రబాబు !
X
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ... నా కంటే దేశంలో సీనియర్ రాజకీయ నాయకుడు లేడు, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ తనకి తాను చాలా గొప్పలు చెప్పుకుంటుంటారు. కానీ, చంద్రబాబు చెప్పేది ఒకటి చేసేది మరొకటి. రాష్ట్రం విడిపోయిన తరువాత నన్ను గెలిపించండి నాకున్న అనుభవం తో సింగపూర్ లాంటి రాజధానిని కడతా అంటూ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ..ఐదేళ్ల కాలంలో ఒక్క శాశ్వతమైన భవనం కూడా కట్టలేదు. దానికి ప్రతిఫలమే 2019 ఎన్నికలలో టీడీపీ ఎన్నడూ చూడనటువంటి ఘోరపరాజయం పాలైంది. కేవలం 23 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. అయినా కూడా చంద్రబాబు నేను చేసిందే కరెక్ట్ అంటూ వైసీపీ ప్రభుత్వం బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.

ఇకపోతే , ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో 2005లో చంద్రబాబుపై లక్ష్మీపార్వతి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారంటూ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై పూర్తిస్థాయిలో విచారణ ప్రారంభించక ముందే చంద్రబాబు ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తన వాదనలను సైతం వినాలని కోరారు. అయితే ఫిర్యాదును విచారణకు స్వీకరించడానికి ముందు దశలోనే వాదనలు వినడం సాధ్యంకాదని చంద్రబాబు అభ్యర్థనను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. దీనిపై చంద్రబాబు హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసి స్టే పొందారు. అయితే గత ఏడాది సుప్రీం ఇచ్చిన తీర్పుతో స్టే గడువు ముగిసింది. దీనితో లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు గతేడాది నవంబర్‌ 18న విచారణ ప్రారంభించింది.

తాజాగా ఈ కేసు పై శుక్రవారం ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. లక్ష్మీపార్వతి తరఫున సీనియర్‌ న్యాయవాది కోకా శ్రీనివాస్‌ కుమార్‌ వాదనలు వినిపించారు. చంద్రబాబు అధికారికంగా వెల్లడించిన ఆస్తుల వివరాల ఆధారంగానే తాము ఫిర్యాదు చేశామని అయన కోర్టుకు తెలిపారు. వేలల్లో ఆదాయం ఉన్న చంద్రబాబు అతి తక్కువ సమయంలోనే కోట్ల ఆస్తులు ఎలా కుట్టబెట్టారో చెప్పలేదు అని, అలాగే పిల్లనిచ్చిన ఎన్టీఆర్‌ కూడా కట్నం ఇవ్వలేదని అధికారిక పత్రాల్లో పేర్కొన్నారు.

ఈ విషయాన్ని చంద్రబాబు ఎన్నికల సమయంలో.. అసెంబ్లీకి ఇచ్చిన పత్రాల్లో ప్రస్తావించారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పొందిన జీతభత్యాలతోనే కోట్లాది రూపాయలు సంపాదించినట్లు చంద్రబాబు చెప్పినట్టు తెలిపారు.

అలాగే హెరిటేజ్‌ కంపెనీ ఏర్పాటు చేశాక నెలకు రూ.20 వేలు చొప్పున ఐదు నెలలే తీసుకున్నట్లు చంద్రబాబు చెప్పారని, అలాంటప్పుడు కోట్ల రూపాయల ఆస్తిని ఎలా సంపాదించారో తేల్చాలని కోర్టుని కోరారు. తదుపరి విచారణ ను ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేసింది.