Begin typing your search above and press return to search.
చంద్రబాబు సొమ్ములూ వాడేస్తున్న వైసీపీ ప్రభుత్వం?
By: Tupaki Desk | 27 July 2022 8:30 AM GMTఅదేంటి..? అనుకుంటున్నారా? ఆశ్చర్యంగా కూడా ఉందా? ఇది నిజమే. చంద్రబాబు హయాంలో కొన్ని సామాజిక వర్గాలకు కేటాయించిన సొమ్ములు.. ఇవ్వలేదు. అయితే.. ఆయా సొమ్ములను వివిధ బ్యాంకుల్లో దాచిపెట్టారు. వాటిని .. సంబంధిత లబ్ధి దారులకు ఈ ప్రభుత్వం ఎప్పుడో ఇవ్వాల్సి ఉంది. కానీ, అలా చేయలేదు. పైగా.. ఈ సొమ్ములు కూడా.. తమకు వాడేసుకునేందుకు.. పులుసులో ముక్కలా కలిపేసుకు నేందుకు.. ఏపీ సర్కారు ప్రయత్నిస్తుండడం గమనార్హం.
ఏం జరిగింది?
రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులుఎదుర్కొంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, తదితర సామాజిక వర్గాల్లోని నిరుపేదలకు దన్నుగా ఉండేందుకు చంద్రబాబు ప్రభుత్వం కొన్ని పథకాలు తీసుకువచ్చింది. వాటి ద్వారా.. వారికి చేతివృత్తుల కింద.. ఇతర సాయాల కింద.. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి.. రాయితీలు అందించింది. తద్వారా వారు ఆర్థికంగా పుంజుకునేలా సర్కారు ప్రయత్నించింది.
ఇలా.. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పేదల అభ్యున్నతికి 20 కార్పొరేషన్ల ద్వారా అందించి.. ఖర్చు కాకుండా మిగిలిపోయిన స్వయం ఉపాధి రుణాల రాయితీ నిధులపై వైసీపీ సర్కారు కన్నేసింది. 2014-15 నుంచి 2018-19 వరకు ఖర్చు కాకుండా ఉన్న నిధులు బ్యాంకుల్లో సుమారు రూ.488 కోట్లు ఉన్న ట్లు గుర్తించింది. దీ మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది.
ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీలోగా ప్రక్రియ పూర్తి చేయాలని అధికారుల కు స్పష్టం చేసింది. వాస్తవానికి గత మూడేళ్లుగా స్వయం ఉపాధి రుణాలివ్వడం లేదు. పోనీ.. గత ప్రభుత్వం ఇచ్చిన రాయితీ నిధుల్నీ విడిచిపెట్టడం లేదు. పేదలు తమ కాళ్ల మీద నిల్చునేందుకు ఊతమిచ్చే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కార్పొరేషన్లను నిర్వీర్యం చేసి నవరత్న పథకాల చెల్లింపులనే వాటి ద్వారా చూపిస్తూ అర్థాన్నే మార్చేసిందనే విమర్శలు వస్తున్నాయి.
రాష్ట్రంలోని దాదాపు 48 బ్యాంకుల్లో రాయితీ నిధులు ఉన్నట్లు వైసీపీ ప్రభుత్వం గుర్తించింది. బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్ ఖాతాల్లో జమ చేసేలా షెడ్యూలు విడుదల చేసింది. దీన్ని పర్యవేక్షించేందుకు ఎస్సీ కార్పొరేషన్‌ను నోడల్ ఏజెన్సీగా నియమించింది. 2019 ఎన్నికల ముందు గత ప్రభుత్వ హయాంలో స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తు చేసుకుని ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్న వివిధ వర్గాల వారు వేల సంఖ్యలో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం వీరికీ ఇవ్వలేదు. అలాగనీ కొత్తగా ఎంపిక ప్రక్రియ చేపట్టలేదు. రాయితీ రుణాల్ని అందజేతను పక్కనపెట్టింది.
488 కోట్లలో ఎవరి వాటా ఎంత?
బీసీలు : 200 కోట్లు
కాపులు: 94 కోట్లు
ఎస్సీలు: 81 కోట్లు
ఎస్టీ+ఇతరులు: 15 కోట్లు