Begin typing your search above and press return to search.
దిశ బిల్లు పై చంద్రబాబు స్పందన ఇదీ
By: Tupaki Desk | 13 Dec 2019 9:57 AM GMTతెలంగాణ లో అసువులు బాసిన దిశ ఉందంతం ఏపీలో ఎక్కడా చోటు చేసుకోకూడదనే సదుద్దేశం తో అధికార వైసీపీ సర్కారు తాజాగా శుక్రవారం అసెంబ్లీలో ‘దిశ బిల్లు-2019’ను ప్రవేశపెట్టింది. మహిళ భద్రతే ధ్యేయంగా జగన్ సర్కారు తెచ్చిన ఈ చట్టంపై శుక్రవారం చర్చ జరిగింది.
ఈ సందర్భంగా దిశ బిల్లుపై మాట్లాడిన ప్రతిపక్ష నేత చంద్రబాబు మహిళల భద్రత గురించి ప్రత్యేక చట్టం తీసుకురావడాన్ని తాము పూర్తిగా స్వాగతిస్తున్నామని అన్నారు. చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం కూడా వీటన్నిటిని అధ్యయనం చేసి కఠిన చట్టాన్ని రూపొందించాలని చంద్రబాబు కోరారు. ఎంత చొరవతో ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారో అమలు చేయడంలో అంతే ఉత్సాహం చూపించాలని వైసీపీ సర్కారుకు చంద్రబాబు సూచించారు.
ఈ సందర్భంగా చట్టసభల్లో ఎంపీ, ఎమ్మెల్యేలు గా ఉన్న వారిపై ఏడీఆర్ రిపోర్ట్ ను చంద్రబాబు ప్రస్తావించారు. దేశంలో 21 మంది బీజేపీ, 16మంది కాంగ్రెస్, 7 వైసీపీ సభ్యులు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నవారు ఉన్నారని ప్రస్తావించారు. వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో టాపిక్ మార్చి చంద్రబాబు ప్రసంగాన్ని కొనసాగించారు.