Begin typing your search above and press return to search.
ఠారెత్తిస్తోన్న ట్యాపింగ్ టెక్నాలజీ కొనుగోళ్లు
By: Tupaki Desk | 13 July 2015 12:11 AM GMTఅదేం సిత్రమో.. నోటి దాకా వచ్చిన ముద్ద నోట్లోకి రాకుండా పోతున్నట్లుగా పీలవుతున్నారు తెలుగు తమ్ముళ్లు. తెలంగాణ సర్కారుని కంట్రోల్ చేయాలని.. ఆత్మరక్షలో పడేయాలనుకున్న ప్రతిసారీ అడ్డంగా బుక్ అవుతున్న పరిస్తితి.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత ఎమ్మెల్యేలతోనే కేసీఆర్ కన్ను పొడవాలనుకున్న ప్లాన్ అట్టర్ ప్లాప్ కావటమే కాదు.. బోలెడన్ని కేసుల్ని మిగిల్చింది. దాని నుంచి బయటపడేందుకు కిందామీదా పడుతుంటే.. పార్టీ ఎమ్మెల్యే రేవంత్ వీడియో.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆడియో సీడులు బయటకు వచ్చిన పరిస్థితి. దీంతో.. పూర్తి స్థాయలో డిఫెన్స్ లో పడిపోయిన బాబు అండ్ కో.. కిందామీదా పడుతున్న పరిస్థితి.
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఫోన్ ని ట్యాప్ చేస్తున్నారన్న విషయాన్ని గుర్తించటానికి పట్టిన సమయం.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవటమేకాదు.. ఆధారాలు సైతం దొరక్కుండా పోవటం తెలిసిందే. తన పరపతిని భారీగా ఉపయోగించి.. గుడ్డిలో మొల్ల మాదిరి ఆధారాల్ని ఏపీ సర్కారు సంపాదించిందని చెబుతున్నారు. తమను తాము రక్షించుకోవటానికి మాత్రమే ఈ ఆధారాలు ఉపయోగపడతాయే కానీ.. తమ రాజకీయ ప్రత్యర్థిని ఇరుకున పడేయటానికి మాత్రం పనికి రాని పరిస్థితి.
ఇదిలా ఉంటే.. తాజాగా వికీలీక్స్ పుణ్యమా అని.. ఏపీ సర్కారు ట్యాపింగ్ టెక్నాలజీ కొనుగోళ్లకు పాల్పడుతుందన్న మాట బయటకు రావటంతో.. ఆ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తమను ఏ ట్యాపింగ్ తో అయితే.. చిరాకు పుట్టించి. తమ పరపతిని పాతాళానికి పడేశారో.. దాన్నే ప్రయోగించి.. ప్రత్యర్థి దిమ్మ తిరిగిపోయేలా చేయాలని చంద్రబాబు అండ్ కో ప్రయత్నించినప్పటికీ అది ఫలించలేదు.
వికీలీక్స్ పుణ్యమా అని కుడితిలో పడిన చందంగా సమాధానం చెప్పలేక బిక్కముఖం వేసే పరిస్థితి. ట్యాపింగ్ ఇష్యూలో ఇప్పటికే వంటి నిండా బురద అంటించుకున్న టీఆర్ ఎస్.. టీడీపీ సర్కారు ట్యాపింగ్ యంత్రాల కొనుగోళ్లకు ప్రయత్నిస్తుందన్న సమాచారంతో చెలరేగిపోతోంది. తాజా పరిస్థితిన ఎంతమాత్రం ఊహించని తమ్ముళ్లకు ఇదో భారీ షాక్ గా చెబుతున్నారు. ట్యాపింగ్ విషయంలో ఉతికి ఆరేయాల్సిన వారే.. ఇప్పుటు ట్యాపింగ్ ఉచ్చులో చిక్కుకుంటే.. ట్యాపింగ్ విషయంలో బిత్తర చూపులు చూడాల్సిన వారు.. అందుకు భిన్నంగా ట్యాపింగ్ పై చెలరేగిపోవటం చూసినప్పుడు.. చంద్రబాబు తెలివితేటల మీద ఎన్నో సందేహలు వ్యక్తమవుతున్న పరిస్థితి. అవును కదా..?