Begin typing your search above and press return to search.

క్రిస్మస్ కు ఏపీ చంద్రుడు కానుక రెఢీ

By:  Tupaki Desk   |   17 Dec 2015 5:26 AM GMT
క్రిస్మస్ కు ఏపీ చంద్రుడు కానుక రెఢీ
X
ఒక చంద్రుడి ప్రభావం మరో చంద్రుడి మీద పడుతున్నట్లుంది. ఇప్పటికే పలు విషయాల్లో ఇదే తీరును ప్రదర్శించిన చంద్రుళ్లు.. తాజాగా తెలంగాణ చంద్రుడ్ని.. ఏపీ చంద్రుడు ఫాలో అయ్యారు. ఇప్పటివరకూ లేని విధంగా క్రిస్మస్ పండగను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర సర్కారు పలు కార్యక్రమాలు అధికారికంగా చేపట్టటం తెలిసిందే. రంజాన్ సందర్భంగా నిర్వహించే ఇఫ్తార్ విందుల తరహాలో.. క్రిస్మస్ విందులు.. పేద క్రిస్టియన్లకు బట్టల పంపిణీ మొదలుకొని చాలానే తోఫాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు.

క్రిస్మస్ సందర్భంగా తెలంగాణ సర్కారు చేపడుతున్న కార్యక్రమాలు ఏపీ సర్కారుకు సరికొత్త స్ఫూర్తినిచ్చినట్లుగా కనిపిస్తోంది. క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్లకు క్రిస్మస్ కానుక అందివ్వాలని ఏపీ సర్కారు డిసైడ్ అయ్యింది. సంక్రాంతి సందర్భంగా చంద్రన్న కానుకను.. క్రిస్మస్ సందర్భంగా పేద క్రిస్టియన్లకు అందజేయాలని డిసైడ్ చేశారు. దీనికి సంబంధించిన నమూనాను బాబుకు చూపించారు ఏపీ మంత్రి పరిటాల సునీత.

శనగపిండి.. గోధుమపిండి.. బెల్లం.. నెయ్యి తదితర వస్తువులతో ఉండే చంద్రన్నకానుక.. క్రిస్మస్ సందర్భంగా పంపిణీ చేయనున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సంక్రాంతి సందర్భంగా చంద్రన్న కానుకలో ఏమేం వస్తువులు ఉంటాయో.. క్రిస్మస్ సందర్భంగా ఇస్తున్న చంద్రన్న కానుకలో కూడా అవే వస్తువులు ఉండటం. చూస్తుంటే.. పండుగ ఏదైనా చంద్రుడి కానుక మాత్రం సేమ్ టు సేమ్ మాదిరి ఉన్నట్లుందే.