Begin typing your search above and press return to search.
విక్రమ్ ల్యాండర్ గురించి మరో గుడ్ న్యూస్ చెప్పిన ఇస్రో..
By: Tupaki Desk | 9 Sep 2019 10:29 AM GMTచంద్రయాన్ 2 ప్రయోగంలో ఆఖరి మజిలీ.. అందునా మరో ఐదు నిమిషాలు అన్ని అనుకున్నట్లుగా సాగితే.. ప్రపంచంలో ఇస్రో ఘనతతో పాటు.. భారతీయ మేథ మీద కొత్త చర్చ ప్రారంభమయ్యేది. ఆఖరి క్షణాల్లో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలతో చంద్రయాన్ 2 ప్రయోగ ఫలితంపై ఉత్కంట నెలకొన్న సంగతి తెలిసిందే.
సాఫ్ట్ ల్యాండ్ అవ్వాల్సిన విక్రమ్ ల్యాండర్ నుంచి ఎలాంటి సంకేతాలు లేకపోవటంతో.. ఎక్కడ ఉందన్న విషయం మీద బోలెడన్ని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. చందమామకు సరిగ్గా 2.1 కిలోమీటర్ల ఎత్తున చంద్రుడి ఉపరితలం మీద పడిన విక్రమ ల్యాండర్ ముక్కలైందని కొందరు.. కాదు.. బోల్తా పడి జారిందని మరికొందరు వాదనలు వినిపించటం తెలిసిందే.
అయితే.. ఇలాంటివేమీ జరగలేదని.. విక్రమ్ ల్యాండర్ సేఫ్ గా ఉందని.. ముక్కలైపోలేదని స్వీట్ న్యూస్ చెప్పింది ఇస్రో. ల్యాండర్ బరువు ప్రజ్ఞాన్ రోవర్‌తో కలిపి 1,471 కేజీలున్న విక్రమ్ లో.. ప్రజ్ఞాన్ రోవర్ ఉందన్న సంగతి తెలిసిందే. దీని బరువు 27కేజీలు. అన్ని అనుకున్నట్లుగా జరిగి.. చందమామపై సేఫ్ గా ల్యాండ్ అయి ఉంటే.. విక్రమ్ ల్యాండర్ లో నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చి.. చందమామ ఉపరితలం మీద పలు శాంపిల్స్ ను సేకరించేది.
అయితే.. సంకేతాలు అందని నేపథ్యంలో విక్రమ్ ల్యాండర్ కు ఏదో జరిగిందంటూ వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని.. విక్రమ్ సేఫ్ గా ఉన్నట్లు ఇస్రో తెలిపింది. చందమామ మీద ఆకర్షణ శక్తి తక్కువగా ఉండటంతో పగిలిపోకుండా ఉన్నది ఉన్నట్లుగా ఉందని..అంతేకాదు.. అంత పై నుంచి పడిపోయిన తర్వాత కూడా పక్కకు ఒరిగిపోకుండా.. పడిన చోటే బుద్ధిగా ఉండిపోయినట్లు నాసా వెల్లడించింది. ఇలాంటి పలు పాజిటివ్ అంశాల నేపథ్యంలో.. మూడు నాలుగు రోజుల్లో విక్రమ్ ల్యాండర్ ను సరిదిద్ది.. దాని నుంచి సిగ్నల్స్ రప్పించే అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఒక్కసారి సిగ్నల్స్ అందితే.. ల్యాండర్ ను బాగు చేసుకోవటానికి వీలుంటుందని చెబుతున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతో ఉత్కంటగా ఎదురుచూస్తున్నట్లు.. విక్రమ్ నుంచి సిగ్నల్ వస్తుందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.