Begin typing your search above and press return to search.
ఢిల్లీలో అధికారులకూ చంద్రబాబు క్లాస్
By: Tupaki Desk | 25 Sep 2015 5:20 AM GMTకేంద్ర మంత్రులను కలిసేందుకు సింగపూర్ నుంచి నేరుగా ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో అధికారులపై ఆగ్రహించారు. అక్కడి ఏపీ భవన్ అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. ఢిల్లీలో ఏపీ భవన్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన బాగా సీరియస్ గా వార్నింగు ఇచ్చినట్లు తెలుస్తోంది. ''సమస్యల పరిష్కారానికి మీరు ఏమీ చేయడం లేదు... మీ స్థాయిలో మీరు కృషి చేస్తే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి.. కానీ అలాంటిదేమీ కనిపించడం లేదు... ఈ పద్ధతి మార్చుకోవాలి'' అని గట్టిగా హెచ్చరించినట్లు చెబుతున్నారు.
రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం తాను ఎంతో కష్టపడి పనిచేస్తున్నానని... కానీ, అధికారులు అందుకనుగుణంగా పనిచేయటం లేదని వారిపై మండిపడ్డారు. గతంలో వచ్చినప్పుడు కేంద్రమంత్రులకు ఇచ్చిన విజ్ఞాపన పత్రాలు - దానికి సంబంధించిన ఫైల్స్ ఆయా మంత్రిత్వ శాఖలో ఎంతవరకు వచ్చాయో వాటి సమీక్ష సమావేశంలో చర్చించినట్లు సమాచారం. వాటిపై ఏపీ భవన్ అధికారుల ఫాలో అప్ సక్రమంగా ఉండకపోవడంతోనే చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహించినట్లు చెబుతున్నారు. దాదాపు గంట సేపు జరిగిన సమావేశంలో పలు అంశాలు గురించి అధికారులకు చంద్రబాబు సూచనలు చేశారు.
కాగా.... రాష్ట్రంలో అధికారులకు చంద్రబాబు క్లాస్ పీకడం మామూలే అయినప్పటికీ ఢిల్లీలో అధికారులకు మాత్రం ఆ అనుభవం తక్కువ... చంద్రబాబు ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా బిజీబిజీగా గడపడం... అధికారులతో మాట్లాడినా కొద్ది సమయంలోనే వివరాలు తెలుసుకోవడంతోనే సరిపోతుంది. దాంతో అక్కడి అధికారులకు చంద్రబాబు క్లాస్ పీకడం తక్కువే. కానీ, ఈసారి గట్టిగానే హెచ్చరించడంతో ఒక్కసారిగా అంతా అలర్టయిపోయారట.