Begin typing your search above and press return to search.

ప‌బ్లిక్ పై ఆంక్ష‌లు విధించిన చంద్ర‌బాబు

By:  Tupaki Desk   |   10 Feb 2017 7:21 AM GMT
ప‌బ్లిక్ పై ఆంక్ష‌లు విధించిన చంద్ర‌బాబు
X
ఓట్లేసే గెలిపించేది వారు... త‌మ సంక్షేమాన్ని ప‌ట్టించుకున్నా ప‌ట్టించుకోక‌పోయినా కిమ్మ‌న‌కుండా ఉండేది వారు.. ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌క‌పోయినా మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌చ్చేవ‌ర‌కు ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ‌త‌తో న‌లిగిపోయేది వారు.. వారు ఇంకెవ‌రో కాదు ప్ర‌జ‌లు. అలాంటి ప్ర‌జ‌ల‌పై ఆంక్ష‌లు విధించేందుకు రెడీ అవుతోంది చంద్ర‌బాబు ప్ర‌భుత్వం. ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ప్ర‌జ‌ల రాక‌పోక‌ల‌పై చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఆంక్షలు విధిస్తోంది.

ఇకపై ప్రభుత్వకార్యాలయాల్లోకి కేవలం ఉద్యోగులను మాత్రమే అనుమతించాలని పలు శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో చంద్రబాబు ఆదేశించారు. కేవలం యాక్సెస్ కార్డులు ఉన్న ఉద్యోగులు మాత్రమే లోనికి వచ్చేలా సిస్టమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యాలయాల్లోకి ఇతరులు రాకుండా నిరోధించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలస్యం చేయకుండా తన ఆదేశాలు వెంటనే అమల్లోకి రావాలని ఆదేశించారు బాబు.

చంద్రబాబు ఆదేశాలపై అధికారులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లోకి ప్రజలను అనుమతించకపోతే అసలు పాలనకు అర్థమేలేదంటున్నారు. పైగా ప్రభుత్వ కార్యాయాలయాల్లో ఏవో జరగకూడని పనులు, వ్యవహారాలు నడుస్తున్నాయన్న భావన ప్రజల్లో కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా మొదట చెప్పే ట్రాన్ఫరెన్సీ అనే మాట ఎటుపోయింద‌ని విప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. తన హయాంలో జరిగే ఘనకార్యాలు ఎక్కడ ప్రజలకు లీక్‌ అవుతాయోన్న భ‌యంతోనే చంద్ర‌బాబు ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని మండిప‌డుతున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/