Begin typing your search above and press return to search.

అమెరికా కాలేజీకి కోట్లు విరాళం ఇచ్చిన మనోళ్లు

By:  Tupaki Desk   |   6 Oct 2015 9:06 AM GMT
అమెరికా కాలేజీకి కోట్లు విరాళం ఇచ్చిన మనోళ్లు
X
అత్యున్నత స్థానాల్ని చేజిక్కించుకోవటం.. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకుంటున్న పలువురు ప్రవాసభారతీయులు.. భారత సంతతికి చెందిన వారు ఇప్పటికే వార్తల్లోకి ఎక్కారు. తాజాగా అందుకు భిన్నమైన మార్గంలో వార్తల్లోకి వచ్చారు భారత సంతతికి చెందిన దంపతులు.

భారీ మొత్తాన్ని విరాళం ఇవ్వటం ద్వారా చంద్రిక.. రాజీవ్ టాండన్ దంపతులు ప్రముఖ వ్యక్తులైపోయారు. న్యూయార్క్ యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ కు వంద మిలియన్ డాలర్ల విరాళాల్ని వారు తాజాగా ప్రకటించారు. రూపాయి మారకంలో వంద మిలియన్ డాలర్లు అంటే.. సుమారు రూ.600కోట్లకు కాస్త ఎక్కువే ఉండే పరిస్థితి.

అయితే.. తామిచ్చిన భారీ విరాళానికి ప్రతిగా కాలేజికి తమ పేరును పెట్టాలన్న కోరికను అధికారులు ఓకే చేశారు. దీంతో..ఇంజనీరింగ్ కాలేజీకి టాండన్ పేరును పెడుతూ నిర్ణయం తీసుకున్నారు. ఒక విశ్వవిద్యాలయానికి ఇంత భారీ మొత్తంలో విరాళం ఇవ్వటం ఇప్పుడు సంచలనంగా మారింది. అంతేకాదు.. భారీ మొత్తంలో విరాళాన్ని ప్రకటించిన భారత సంతతికి చెందిన అమెరికన్లుగా రికార్డు సృష్టించారు. తెలివితేటల విషయంలోనే కాదు.. దాతృత్వంలోనూ తమది పెద్ద మనసేనన్న విషయాన్ని తాజా విరాళంతో భారత సంతతి స్పష్టం చేసిందని చెప్పొచ్చు.