Begin typing your search above and press return to search.
ఏపీలో మంత్రి వర్గం మార్పు అప్పుడే.. ఔట్ అయ్యేవారు వీరేనా?
By: Tupaki Desk | 15 Feb 2021 3:56 PM GMTఏపీలో అప్రతిహత విజయం సాధించి.. అధికారంలోకి వచ్చిన వైసీపీ.. మంత్రి వర్గం ఏర్పాటు విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తోంది. 151 మంది ఎమ్మెల్యేలను కైవసం చేసుకున్న వైసీపీ.. సీఎంగా జగన్‌ను పక్కన పెడితే.. 150మంది ఎమ్మెల్యేలు ఈ పార్టీ సొంతం. అయితే.. రాష్ట్ర కేబినెట్ కుఉన్న పరిమితి నేపథ్యంలో మంత్రుల సంఖ్య 25కు మించరాదు. ఈ నేపథ్యంలో 2019 మే 30న సీఎంగా ప్రమాణం చేసిన జగన్.. అనం తరం.. తన కేబినెట్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే.. ఉన్నవారంతా తనకు కావాల్సిన వారే కావడంతో.. అందరికీ మంత్రి పదవులు ఇచ్చేందుకు సాద్యం కాదని స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే పాతిక మందిని ఎంపిక చేసి మంత్రులుగా నియమించారు. వీరిలో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన వారు కూడా ఉండడం గమనార్హం. పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు, రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ.. వంటివారు.. ఈ జాబితాలోని వారే. జగన్ కేబినెట్‌లో ఎవరికైనా చోటు ఉంటుందనే సంకేతాలు పంపారు. నాయకులు ఎక్కువ కావడంతో.. రెండున్నరేళ్ల తర్వాత.. వీరిని మార్చి.. కొత్తవారికి అవకాశం కల్పిస్తానని చెప్పారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆ సమయం వచ్చేందుకు మరో ఆరు మాసాల పైనే ఉంది. అయినప్పటికీ.. మంత్రి వర్గ కూర్పుపై మాత్రం తాజాగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
దీంతో చాలా మంది కొత్త, పాత వారు సైతం చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇలా చూస్తే.. సంఖ్య పెరిగిపో తుందని భావించిన ముఖ్యమంత్రి జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం కొత్త జిల్లాలకు రంగం సిద్ధమవుతున్న దరిమిలా.. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్కరిని తీసుకుని మంత్రిని చేస్తే.. అందరికీ సమన్యాయం చేసినట్టు అవుతుంది. తనకు కూడా తలనొప్పి తగ్గుతుందని భావిస్తున్నట్టు సమాచారం. అంటే.. రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 25-26కు పెరిగితే.. ఒక్కొక్క జిల్లాకు ఒక్కక్కిరిని..మంత్రి వర్గంలోకి తీసుకుంటారని అంటున్నారు.
దీనిని బట్టి ఇప్పుడు ఉదాహరణకు కర్నూలు జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉంటే.. వచ్చే మంత్రి వర్గ కూర్పులో మాత్రం.. కర్నూలు నుంచి ఒకరు.. నంద్యాల పార్లమెంటు స్థానం కూడా జిల్లా అవుతుంది కనుక.. ఇక్కడ నుంచి మరో నేతకు అవకాశం కల్పిస్తారని వైసీపీలో ముఖ్యంగా సీఎంవోలో పెద్ద ఎత్తున చర్చ సాగుతుండడం గమనార్హం. మంత్రి వర్గం కూర్పుపై ఇలా ఎవరికి లెక్కలు వారు వేసుకోవడం గమనార్హం.