Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్: పిల్లల ప్రవర్తనలో మార్పులు.. తల్లిదండ్రులకు గడ్డుకాలం

By:  Tupaki Desk   |   15 May 2021 3:54 AM GMT
కరోనా ఎఫెక్ట్: పిల్లల ప్రవర్తనలో మార్పులు.. తల్లిదండ్రులకు గడ్డుకాలం
X
కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో గతేడాది నుంచి పిల్లల చదువుకు తీవ్రం ఆటంకం ఏర్పడింది. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. పరీక్షలు రాయకుండానే పాస్ చేస్తున్నారు. బయటకు వెళ్లి ఆడుకునే పరిస్థితి లేదు. ఇక గది నాలుగు గోడలకే పిల్లలు పరిమితమయ్యారు. ఎంతసేపటికీ ఫోన్, టీవీలు, వీడియో గేమ్స్ చూడాల్సి వస్తుంది. వీటి ప్రభావం పిల్లలపై తీవ్రంగా ఉంటుందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కరోనా భయంతో పిల్లల విషయంలో తల్లిదండ్రులు కాస్త కఠినంగా వ్యవహరిస్తున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఈ కరోనా ప్రభావం చిన్నారులపై చాలా ఉంటుందని... ఫలితంగా వింతగా ప్రవర్తిస్తారని అంటున్నారు. స్నేహితులు లేకపోవడం, నాలుగు గోడలకే పరిమితమవడంతో మానసికంగా కుంగిపోతున్నారని అభిప్రాయపడుతున్నారు.

తల్లిదండ్రుల పట్ల పిల్లలు తీవ్రంగా స్పందిస్తున్నారని మానసిక నిపుణులను సంప్రదిస్తున్నారు. పిల్లల్లో దుందుడుకు స్వభావం పెరుగుతోందని... ఈ కాలంలో చాలామంది తల్లిదండ్రులు తమ వద్దకు వస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. కాగా ఇది తల్లిదండ్రులకు గడ్డుకాలమని హెచ్చరిస్తున్నారు. చిన్నారులు వివిధ సవాళ్లను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ కాలంలో పిల్లలతో చాలా సున్నితంగా వ్యవహరించాలని సూచించారు.

పిల్లల సమస్యలను లోతుగా అర్థం చేసుకోవాలని అంటున్నారు. వారిని భయపెట్టకుండా స్నేహంగా వ్యవహరించాలని సూచించారు. ఇంట్లో ప్రశాంతమైన వాతావారణం ఉండేలా చూసుకోవాలని అన్నారు. ఆన్లైన్ గేమ్, టీవీలకే పరిమితం కాకుండా తల్లిదండ్రులు వారితో సమయాన్ని గడపాలని చెప్పారు. వివిధ రకాల అంశాలను వివరించాలని పేర్కొన్నారు. పాజిటివ్ అంశాలనే ప్రస్తావించాలని... ఇలాంటి సమయంలో ప్రతికూల విషయాలను చర్చించకూడదని హెచ్చరించారు.