Begin typing your search above and press return to search.
జమ్ముకశ్మీర్ లో ఇక ఏమేం మార్పులు వస్తాయి!
By: Tupaki Desk | 5 Aug 2019 1:49 PM GMTకశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకున్న తాజా చర్యలు ఆ ప్రాంతంలో ఎన్నో మార్పులు తీసుకురానున్నాయి. ముఖ్యంగా ఇకపై జమ్ముకశ్మీర్ అనేది రాష్ట్రంగా ఉండదు.. దానికి ముఖ్యమంత్రి ఉండరు. అక్కడి రాజకీయ పార్టీలు నామమాత్రమవుతాయి. అంతేకాదు.. అది రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారిపోతుంది.
- జమ్మకశ్మీర్ పేరుతో ఒక కేంద్ర పాలిత ప్రాంతం.. దీనికి లెఫ్లినెంట్ గవర్నరుతో పాటు అసెంబ్లీ ఉంటుంది. రెండోది లద్దాఖ్.. దీనికి లెఫ్టినెంట్ గవర్నరు మాత్రమే ఉంటారు.
- ఆర్టికల్ 370లో ఒక విభాగం మాత్రం అలాగే ఉంచారు. దాని ప్రకారం రాష్ట్రపతి ఏదైనా మార్పులకు ఆదేశాలు జారీ చేయవచ్చు.
- ఇంతకు ముందు 'శాశ్వత నివాసి'గా రాష్ట్రంలో ఉన్నవారు మాత్రమే ఆస్తులు కొనుగోలు చేయగలిగేవారు. ఇప్పుడు ఎవరైనా అక్కడ ఆస్తులు కొనవచ్చు.
- ఇంతకు ముందు - 'శాశ్వత నివాసులను' మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించేవారు. ఇప్పుడు ఎవరినైనా నియమించవచ్చు.
- ఇంతకు ముందు ఇక్కడ శాంతి భద్రతలు ముఖ్యమంత్రి అదుపులో ఉండేవి. ఇప్పుడు రాష్ట్ర ప్రతినిధి అంటే లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఇవి నేరుగా కేంద్ర హోంమంత్రి పరిధిలోకి వస్తాయి.
- కేంద్రం రూపొందించే చట్టాలన్నింటినీ ఇంతకు ముందు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించాల్సి వచ్చేది. ఇప్పుడు అవి ఆటోమేటిగ్గా అమల్లోకి వస్తాయి.
- ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఇక్కడ నేరుగా అమలవుతాయి.
- రాష్ట్ర ప్రభుత్వ జెండాకు ఇప్పుడు ప్రాధాన్యం ఉండదు. జాతీయ జెండాయే ఉంటుంది. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర జెండాను రద్దు చేసే అవకాశముంది.
- రాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి ఆరేళ్ల నుంచి ఐదేళ్లకు తగ్గిస్తారు.
- మహిళలకు వర్తించే స్థానిక సంప్రదాయ వ్యక్తిగత చట్టాలను తొలగిస్తారు.
- ఇండియన్ పీనల్ కోడ్ అమలులోకి వస్తుంది.