Begin typing your search above and press return to search.

కేసీఆర్ క్యాబినెట్ లో మార్పులు .. ఉండేదెవరు? ఊడేదెవరు ?

By:  Tupaki Desk   |   12 Nov 2019 9:44 AM GMT
కేసీఆర్ క్యాబినెట్ లో మార్పులు .. ఉండేదెవరు? ఊడేదెవరు ?
X
తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలో నే తన క్యాబినెట్ లో మార్పులు చేయబోతున్నారు అనే ఒక వార్త బయటకి రావడంతో మంత్రుల్లో టెంక్షన్ మొదలైంది. రాష్ట్ర మంత్రి వర్గ పునర్‌ వ్యవస్థీకరణ అంటూ వస్తున్న వార్తల తో మంత్రులు ఆందోలన చెందుతున్నారు. ఈసారి కచ్చితం గా ఇద్దరి పై వేటు పడే అవకాశం ఉంది అని జోరు గా ప్రచారం జరుగుతుండడం తో ఎవరి పదవి ఉంటుందో ..ఎవరి పదవి ఊడుతుందో అని టెంక్షన్ పడుతున్నారు. మరీ క్యాబినెట్ నుండి బయట కి రావడానికి సిద్ధం గా ఉన్న ఆ ఇద్దరు మంత్రులు ఎవరు ? అసలు సీఎం కేసీఆర్ మదిలో ఏముంది? ఇదే ఇప్పుడు తెరాస నేతల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్తలు ఇప్పుడు 16 మంది మంత్రులను టెన్షన్‌ పెడుతున్నాయి. దీనితో పాత మంత్రుల్లో ఎవరి సీటు ఉంటుందో.. ఎవరి సీటు ఊడుతుందో అనే భయం అందరిలోనూ ఉంది.

ఇక పోతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కేబినెట్‌ లో నలుగురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు . జిల్లాలో ఈటెల రాజేందర్‌ కు చెక్‌ పెట్టేందుకే గంగుల కమలాకర్‌ ను మంత్రివర్గం లోకి తీసుకున్నారనే ప్రచారం నడిచింది. అయితే కేబినెట్‌ విస్తరణ టైమ్‌ లో ఎవ్వరిని టచ్ చేయలేదు. అయితే కరీంనగర్‌ లో జిల్లా లో నలుగురు మంత్రు ల్లో ఒకరి పదవి కి ఈసారి ప్రమాదం పొంచి ఉందని ప్రచారం జరుగుతోంది. అలాగే ఉమ్మడి రంగా రెడ్డి నుండి సబితా ఇంద్రారెడ్డి, మల్లా రెడ్డి ఉండ గా సబితా ఇంద్రా రెడ్డి ని క్యాబినెట్ లోకి తీసుకున్నప్పుడే మల్లారెడ్డి ఔట్ అనుకున్నారు, కానీ అప్పుడు ఆయన్ని కూడా సీఎం టచ్ చెయ్యలేదు. కానీ తాజాగా ఆ మంత్రి పై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఫిర్యాదులు ఎక్కువ అయ్యాయి. దీంతో మంత్రివర్గం నుండి ఉద్వాసనకి గురయ్యే జాబితాలో ఆయన పేరు కూడా ఉండచ్చు అనే ప్రచారం పార్టీలో ఊపందుకుంది.

కొత్త గా నిజామాబాద్, నల్గొండ జిల్లాల నుండి కొత్తవారికి ఛాన్స్ ఉన్నట్టు పార్టీ వర్గాల్లో న్యూస్‌ వైరల్‌ అవుతోంది. హుజుర్‌ నగర్ ఉప ఎన్నిక ఇంచార్జి గా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సక్సెస్ అవ్వడం తో మంత్రి పదవి దక్కే వారిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి పెరు కూడా తెర పైకి వచ్చింది. మొత్తం గా మరికొద్ది రోజుల్లో నే సీఎం కేసీఆర్ తన క్యాబినెట్ లో మార్పులు చేయ బోతున్నారనే వార్తల తో మంత్రి వర్గం మొత్తం ఎవరి పదివి ఉంటుందో ..ఎవరి పదవి ఊడుతుందో అని చర్చించుకుంటున్నారు.