Begin typing your search above and press return to search.
`ఏమార్చడం` ఎల్లకాలం పనిచేయదు మోడీ సార్!!
By: Tupaki Desk | 3 May 2021 8:00 AM GMT'ఏమార్చడం..` అనేది ప్రధాని నరేంద్ర మోడీకి రాజకీయాల్లో వెన్నతో పెట్టిన విద్య అంటారు.. ఆయన గురిం చి బాగా తెలిసిన వారు! చేసింది తక్కువే అయినా.. చెప్పుకోవడంలో దిట్టగా ఆయన పేరు తెచ్చుకున్నారు. మాటల మంత్రదండంతో ప్రజలను తన గాటన కట్టేసుకునేందుకు మోడీ ప్రయత్నించని అంశం లేదు రాజకీయాల్లో! అయితే.. అది కొన్నాళ్లు దేశంలో వర్కవుట్ అయినా.. ఇప్పుడు మాత్రం ఫలించలేదు. తాజాగా వచ్చిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే.. బీజీపీకి భారీ ఎత్తున ఎదురు దెబ్బ తగిలింది.
చిన్న రాష్ట్రం అసోం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అధికారం దక్కించుకున్నా.. అక్కడకూడా భారీ మెజారిటీ అయితే.. దక్కించుకోలేదు. ఏదో గెలిచాం అంటే.. గెలిచాం.. అన్నట్టుగా అక్కడ నెగ్గుకొ చ్చింది. ఇక, ప్రధాన రాష్ట్రాలు, పె ద్ద రాష్ట్రాలు అయిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళల్లో బీజేపీ ఊహించిన దానికి అక్కడ వచ్చి రిజల్ట్‌కు మధ్య చాలా వ్యత్యాసం కనిపించింది. నిజానికి బెంగాల్ ఎన్నికలను ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బెంగాల్ పీఠం నుంచి మమతను దింపేయడం ఖాయమని ప్రకటించారు.
అదేసమయంలో బీజేపీ జెండా ఎగురుతుందని.. బెంగాల్ ప్రజల జాతకం మారుస్తామని స్వయంగా ప్రధా ని నరేంద్ర మోడీ ప్రకటించారు. భారీ బహిరంగ సభల్లోనూ ఇదే కామెంట్ చేశారు. అయితే.. ఇక్కడ పుంజు కున్నా.. అధికారంలోకి మాత్రం రాలేక పోయారు. అదేసమయంలో మమత హవాకు అడ్డుకట్ట వేయలేకపో యారు. ఇక, మోడీని మోసే బీజేపీ అనుకూల మీడియా.. ఆ పార్టీ సోషల్ మీడియాలు కూడా ప్రజలను ఏమార్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేశాయనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఇంకేముంది.. బెంగాల్లో బీజేపీ పాగా వేయనుందని.. ఇక్కడ సంచలన విజయం సాధించడం ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి.
అంతేకాదు.. ఎక్కడా ఏ రాష్ట్రంలో లేని విధంగా కోల్‌కతాలో వందల సంఖ్యలో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసి, అక్కడే తిష్టవేసిన షా.. మమతా బెనర్జీ కూటమిని చిన్నాభిన్నం చేసేందుకు ప్రయత్నిం చారు. 30 మంది కీలక నేతలను పార్టీలోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేలను, మంత్రులను సైతం లాగేశారు. వీరితోనూ ఇక, బీజేపీ మాత్రమే బెంగాల్ ప్రజలకు దిక్కని, మమత పని అయిపోయిందని ప్రచారం చేయిం చారు. తీరా ఇంత చేసినా.. క్షేత్రస్థాయిలో మాత్రం మమత కోటను కమలం ఏమీ చేయలేక పోయిందనే సత్యం స్పష్టమైంది.
మరోవైపు ఈ ఎన్నికల ప్రచారం, వ్యూహాలు.. వంటి వాటిలో పూర్తిగా మునిగిపోయిన మోడీ సర్కారు.. భయంకరంగా ఉప్పెన మాదిరిగా దూసుకువచ్చిన కరోనా సెకండ్ వేవ్ విషయంలో తీవ్రంగా విఫలమైంది. మరోవైపు మూడో వేవ్ ముంచుకువస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నా.. కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి యుద్ధ సన్నద్ధతా ప్రకటించకపోవడం గమనార్హం. టీకాల లభ్యత, నిల్వలు అడుగంటాయి. ఇప్పటికే ఉత్పత్తి చేసిన టీకాలను ఇతర దేశాలకు మోడీ ఉదారంగా సమర్పించేసి.. అంతర్జాతీయ మీడియాలో సానుభూతి పొందే ప్రయత్నం చేయడం కూడా శాపంగా మారిపోయింది.
ఇక్క టీకానే కాదు.. ప్రాణాలను నిలబెట్టే ఔషధాలు కూడా ప్రస్తుతం దేశంలో అడుగంటాయి. వీటిలో రెమ్‌డెసివర్, ఆక్సిజన్ సిలిండర్లు.. లేక అనేక మంది కరోనా బాధితులు పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రతి రోజూ వీరి సంఖ్య పెరుగుతూనే ఉంది. అయినా..కూడా ఏ మాత్రం చీమకుట్టినట్టు అటు మోడీకానీ, ఇటు షా కానీ వ్యవహరించలేక పోతున్నారు. దీనికి కారణం.. అనుకూల మీడియాలో జరుగుతున్న సానుకూల ప్రచారమే. అయితే.. క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజలు వీటిని గమనిస్తున్నందునే.. ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి తీవ్రమైన ఎదురు దెబ్బ ఎదురైందని అంటున్నారు పరిశీలకులు. మరి ఇప్పటికైనా.. ఏమార్చడం అనేది కొన్నాళ్లే పనిచేస్తుందని.. వాస్తవాలు.. ఒక్కసారి బయటకు వస్తే.. ప్రజలు విశ్వసిస్తే.. ఇక కూసాలు కదిలిపోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.