Begin typing your search above and press return to search.

మారిపోతున్న పంజాబ్ సమీకరణలు

By:  Tupaki Desk   |   9 Feb 2022 4:30 PM GMT
మారిపోతున్న పంజాబ్ సమీకరణలు
X
పంజాబ్ లో పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. మొదట్లో ఆమ్ ఆద్మీ పార్టీదే అధికారమని చాలా మీడియా సంస్థలు ప్రీ పోల్ సర్వేల్లో తేల్చాయి. అప్పటికి కాంగ్రెస్ లో కుమ్ములాటలు ఫుల్లుగా నడుస్తున్నాయి. కెప్టెన్ అమరీందర్ సింగ్ కు పీసీసీ అధ్యక్షుడు నవ్ జోత్ సింగ్ సిద్ధుకి ఏ మాత్రం పడటం లేదు. దాంతో సిద్ధు పోరు పడలేక అధిష్టానం రాజీనామా చేయమని అడగ్గానే కెప్టెన్ రాజీనామా చేసేశారు. వెంటనే పార్టీని వదిలేశారు.

కెప్టెన్ స్థానంలో వచ్చిన చరణ్ జీత్ సింగ్ చన్నీతో కూడా సిద్ధుకు పడటం లేదు. అప్పటికే జనాల్లో బాగా దూసుకుపోతోంది ఆప్. ఒకవైపు ఆప్ దూసుకుపోవటం, మరోవైపు కాంగ్రెస్ లో కుమ్ములాటలు తారా స్ధాయికి చేరుకోవటంతో ఆప్ దే అధికారం అని అందరూ స్థిరపడిపోయారు. దీనికితోడు బీజేపీపై అసలు ఆశలే పెట్టుకోలేదు ఎవరు. అయితే అప్పటికి ఇప్పటికి పరిస్థితులు మారుతున్నాయి. కారణాలు ఏవైనా చన్నీ-సిద్ధు ఏకమైపోయారు.

టికెట్ల కేటాయింపులో పెద్దగా గొడవలు లేకపోగా పార్టీ తరపున కలిసికట్టుగానే ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఎవరూ ఊహించలేదు. అంటే కాంగ్రెస్ బలపడిన కొద్ది ఆప్ కు వస్తుందని అనుకుంటున్న సీట్ల తగ్గే అవకాశముంది.

ఈ విషయాలను పక్కన పెట్టేస్తే హఠాత్తుగా జైలు నుంచి బెయిల్ పై విడుదలైన డేరా బాబా వ్యవహారం సంచలనంగా మారింది. డేరా బాబాకు పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానాలో కోట్లాదిమంది భక్తులున్నారు. ఇపుడు యూపీ, పంజాబ్ లో ఎన్నికలు జరుగుతున్న కారణంగా బీజేపీయే డేరా బాబాను రిలీజ్ చేయించిందనే ఆరోపణలున్నాయి.

డేరా బాబా వల్ల బీజేపీ గనుక పుంజుకుంటే ఆప్ కు మరింత దెబ్బ ఖాయమనే అనుకోవాలి. చివరికి ఏమవుతుందంటే హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశాలే ఎక్కువున్నాయి. ఉన్న 117 సీట్లను తలాకాసిన్ని పంచుకుంటే వచ్చేది హంగ్ అసెంబ్లీయే అనటంలో సందేహం లేదు.

అలా కాదని జనాలు ఆల్రెడీ ఫిక్సయిపోయిన ఆప్ కే ఓట్లేస్తారా అన్నది చూడాలి. ఇప్పటికైతే ఆప్ కు రాష్ట్రంలో క్లీన్ రికార్డే ఉంది. అలాగే చన్నీకి కూడా మంచి సీఎం అనే పేరుంది. అందుకనే రాజకీయ సమీకరణలు పంజాబ్ లో మారిపోతున్నాయని అనుకుంటున్నది. చివరకు ఏమవుతుందో చూడాలి.