Begin typing your search above and press return to search.

ఏడు ద‌శ‌ల ఎన్నిక‌లు.. యూపీలో మారే స‌మీక‌ర‌ణ‌లు ఏంటి?

By:  Tupaki Desk   |   9 Jan 2022 8:30 AM GMT
ఏడు ద‌శ‌ల ఎన్నిక‌లు.. యూపీలో మారే స‌మీక‌ర‌ణ‌లు ఏంటి?
X
దేశంలో పెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ విధాన స‌భ ఎన్నిక‌ల‌కు న‌గారా మోగింది. మొత్తం ఏడు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నా యి. అయితే.. ఇన్ని ద‌శ‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌ప‌డంపై స్థానికంగా ఉన్న ఎస్పీ, బీఎస్పీ త‌దిత‌ర పార్టీలు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నాయి. ఇదంతా వ్యూహాత్మ‌కంగా తీసుకున్న నిర్ణ‌య‌మ‌ని.. ఆరోపిస్తున్నాయి. అయితే.. ఎవ‌రు ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా.. ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌య‌మే ఫైన‌ల్‌. సో.. ఈ ఏడు ద‌శ‌ల్లో ఎన్నిక‌ల‌ను గ‌మ‌నిస్తే.. మారుతున్న స‌మీక‌ర‌ణ‌లు ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది. మొత్తం ఏడుద‌శ‌ల్లో వివాదాస్ప‌ద నియోజ‌క‌వ‌ర్గాల‌ను చివ‌రి రెండు ద‌శ‌ల్లో చేర్చే అవ‌కాశం ఉంటుంది.

ఎందుకంటే.. బ‌ల‌గాల‌ను ఎక్కువ‌గా మోహ‌రించేందుకు అప్పుడే అవ‌కాశం ఉంటుంది. స‌రే. రాజ‌కీయంగా ఈ ఏడు ద‌శ‌లు పార్టీల‌పై ఎలాంటి ప్ర‌భావం చూపుతాయ‌నేది చూస్తే.. అధికార బీజేపీకి కానీ, ప్ర‌తిప‌క్షాలైన ఎస్పీ, బీఎస్పీ , కాంగ్రెస్‌ల‌కు కానీ.. ప్ర‌చారం చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే.. ఇక్క‌డే కీల‌క‌మైన ఒక ప‌రిణామాన్ని గ‌మ‌నించాల్సి ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అదేంటంటే.. తొలి ద‌శ ఎన్నిక‌ల వాతావర‌ణాన్ని బ‌ట్టి.. బీజేపీ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దిపే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని చెబుతున్నారు. గ‌తంలో ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌లు కూడా ఏడు ద‌శ‌ల్లోనే జ‌రిగాయి. ఆ స‌మ‌యంలో తొలి రెండు ద‌శ‌లు త‌ర్వాత‌.. రాజ‌కీయంగా పెను మార్పులు చోటు చేసుకున్నాయి.

ప్ర‌ధాన పార్టీల మ‌ద్య అభ్య‌ర్థుల జంపింగులు పెరిగాయి. అంతిమంగా ఇది ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం చూపింది. ఇప్పుడు యూపీలో నూ ద‌శ‌ల వారీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కీల‌క‌మైన ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌ల నుంచి అధికార పార్టీ.. ఎన్నిక‌ల స‌ర‌ళిని బ‌ట్టి.. జంపిం గుల‌ను ప్రోత్స‌హించేందుకు అవ‌కాశం ఉంద‌ని .. ఆయా పార్టీలు అంచ‌నా వేస్తున్నాయి. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించేందుకు అన్ని పార్టీల‌కూ అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ.. దీనిలోనూ అధికార పార్టీ దూకుడు పెంచే ఛాన్స్ ఉంద‌నే లెక్క‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. అంటే.. మొత్తంగా ఏడు ద‌శ‌ల ఎన్నిక‌ల్లో ఎన్నో కిత‌కిత‌లు చోటు చేసుకునేందుకు అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. వీటిని స‌మ‌ర్ధ‌వంతంగా త‌ట్టుకుని నిల‌బ‌డితేనే పార్టీల వ్యూహాలు స‌క్సెస్ అవుతాయని.. లేక‌పోతే.. క‌ష్ట‌మేన‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.