Begin typing your search above and press return to search.
చంద్రబాబు అమర్ రహే: తెలుగు తమ్ముళ్లు!
By: Tupaki Desk | 19 Sep 2017 8:10 AM GMTఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి లోకేష్ ప్రసంగాలలో కోకొల్లలుగా తప్పులు దొర్లడం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఏపీ సీఎం గారి తనయుడు అమాత్యునిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు ఆయన తప్పుల తడికకు ఇంతవరకు బ్రేకులు పడలేదు. భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని జయంతిని చేయడం - గ్రామాల్లో నిధులు ఖర్చు పెట్టి సమస్యలు సృష్టించడం - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంగా సంబోధించడం వంటివి ఆయన ప్రసంగాలలో మచ్చు తునకలు. చేసిన పొరపాట్లనే చేస్తూ తన రికార్డును పదిలంగా కొనసాగిస్తున్నాడు లోకేష్ బాబు. అయితే, ఈ పొరపాట్ల జాడ్యం ఆయనకే పరిమితం కాలేదు. ఆయనతో పాటు తెలుగుదేశం కార్యకర్తలకు కూడా ఈ తప్పుల జబ్బును అంటగట్టాడు. లోకేష్ లాగే టీడీపీలో మహానుభావులకు కొదవేం లేదని తాజాగా జరిగిన ఓ ఘటన నిరూపించింది. తాజాగా కడప జిల్లా రాజంపేటలో టీడీపీ కార్యకర్తలు ఏపీ సీఎం చంద్రబాబు అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. బంగారంలా బతికున్న బాబుగారికి అపుడే పాడె కట్టేశారు తెలుగు తమ్ముళ్లు.
రాజంపేటలో టీడీపీ కార్యకర్తలకు సంబంధించిన కార్యక్రమం ఒకటి జరిగింది. అందులో పాల్గొన్న తెలుగు తమ్ముళ్లు తమ పార్టీ అధినేత చంద్రబాబుకు జేజేలు కొట్టేందుకు అత్యుత్సాహం ప్రదర్శించారు. చంద్రబాబుపై వీరాభిమానంతో జై జై నినాదాలకు బదులుగా చంద్రబాబు అమర్ రహే.. అనేశారు. ఒకసారి అయితే, ఏదో పొరపాటుగా అన్నారులే అనుకోవచ్చు. కానీ, తెలుగు తమ్ముళ్లు అనేక సార్లు ఆ మాటను అన్నారు. తమ ప్రియతమ నాయకులు చనిపోయినా, వారు తమ మదిలో శాశ్వతంగా జీవించి ఉన్నారని స్మరించుకోవడానికి అమర్ రహే అనే నినాదాన్ని చేస్తారు. మరి లక్షణంగా బతికున్న చంద్రబాబును కార్యకర్తలు అమర్ రహే అని సంబోధించడం వెనుక లోకేష్ బాబు ఎఫెక్ట్ ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆర్నెల్లు సావాసం చేస్తే వారు వీరవుతారన్న సామెతకు తగ్గట్లుగా....లోకేష్ బాబు ప్రసంగాలు వినీ వినీ, తెలుగు తమ్ముళ్లు కూడా ఆయన లాగే తయారయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికి చంద్రబాబును అమర్ రహే అన్న కార్యకర్తలు భవిష్యత్తులో లోకేష్ బాబు ముర్దాబాద్ అని అన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదేమో!