Begin typing your search above and press return to search.
మనోళ్ల చెప్పులు దొంగలించిన పాకిస్థాన్
By: Tupaki Desk | 27 Dec 2017 10:09 AM GMTదాయాది దేశమైన పాకిస్థాన్ కక్కుర్తి మరోమారు బయటకు వచ్చింది. తనది కాని మన దేశ భూభాగాన్ని ఆక్రమించేందుకు కక్కుర్తి పడుతున్న పాక్...ఆఖరికి చెప్పులు కూడా దొంగతనం చేసింది. కుల్‌భూషణ్ జాదవ్ ను చూడటానికి పాకిస్థాన్ వెళ్లిన సమయంలో ఆయన భార్య చేతన్ కుల్ తాళి తీయించి.. బొట్టు చెరిపేయించి నానా రభస చేసిన పాక్.. చివరికి ఆమె వేసుకున్న షూస్ కూడా తిరిగివ్వని విషయం తెలిసిందే. ఎందుకని అడిగితే అందులో ఏదో లోహంలాంటి వస్తువు ఉన్నది.. దానిని పరీక్షిస్తున్నామంటూ పాకిస్థాన్ ఓ చెత్త కారణం చెప్పింది.
అయితే ఈ ఘటన తర్వాత పాక్ పై ఉన్న ద్వేషం కట్టలు తెంచుకుంటోంది. #చెప్పల్ చోర్ పాకిస్థాన్ అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. దాయాది తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు నెటిజన్లు. ఇంత జరిగినా చూస్తూ ఉండటం.. ఎందుకు ఆ దేశాన్ని మొత్తం నాశనం చేయండంటూ ట్వీట్లు చేస్తున్నారు. `మీది పేద దేశం అని తెలుసుగానీ మరీ ఇంత పేదది అని అనుకోలేదు`.. `పోష్ గా ఉండే ఇండియన్ ప్రోడక్ట్స్ అంటే వారికి మోజెక్కువ.. అందుకే ఎవరో ఓ పోలీస్ అధికారి తన భార్య కోసం ఆమె చెప్పులను దొంగిలించి ఉంటాడు`... `మా దగ్గర పాత చెప్పులు చాలా ఉన్నాయి.. అవన్నీ తీసుకొని ఆమె చెప్పులు ఆమెకు తిరిగివ్వండి`.. ఇవీ పాకిస్థాన్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో పేలుతున్న జోక్స్. ఇవి జోకులే కాదు పాక్ తీరు చూసి కడుపు మండి పెడుతున్న శాపనార్థాలు కూడా అని అంటున్నారు.
ఇదిలాఉండగా...కుల్‌భూషణ్ జాదవ్ కుటుంబసభ్యులను పాకిస్థాన్ వేధించిన అంశంపై ఇవాళ లోక్‌స భలో రగడ చెలరేగింది. విపక్ష పార్టీలు పాక్ వ్యవహార శైలిని ఖండించాయి. కుల్‌భూషణ్ జాదవ్ ను వెంటనే వెనక్కి తీసుకురావాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడుతూ కుల్ భూషణ్ తల్లి - భార్య పట్ల పాక్ ప్రవర్తించిన తీరును తప్పుపట్టారు. అయితే దీనిపై విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు. ఈ అంశంపై తాను గురువారం ప్రకటన చేయనున్నట్లు ఆమె చెప్పారు. కుల్ భూషణ్ కుటుంబంతో పాక్ వ్యవహరించిన తీరును కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ కూడా తప్పుపట్టారు. ఇంత కన్నా పాకిస్థాన్ నుంచి ఏమీ ఆశించేది ఉండదన్నారు. చాలా అవమానకర రీతిలో వాళ్లను ట్రీట్ చేశారన్నారు.