Begin typing your search above and press return to search.
అప్పటి కిడ్నాప్ ఎపిసోడ్ పై భూమా అఖిలపై ఛార్జిషీట్
By: Tupaki Desk | 21 Feb 2022 1:30 PM GMTకొద్ది నెలల క్రితం రాత్రి వేళ.. హైదరాబాద్ మహానగరంలో ఒక కిడ్నాప్ జరగటం.. కట్ చేస్తే.. ఉదయానికి సీన్ మొత్తం భారీ సంచలనంగా మారటం తెలిసిందే. ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ.. ఆమె భర్త.. సోదరుడు కలిసి బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇద్దరు వ్యక్తులను కిడ్నాప్ చేయటం.. వారికి సంబందించిన వేలాది కోట్లకు సంబంధించిన భూములు ఉన్నట్లుగా వాదనలు వినిపించాయి.
ఆదాయపన్ను అధికారులుగా వేషాలు వేసుకొని ల్యాండ్ యజమానులుగా పేరున్న ప్రవీణ్ రావు.. నవీన్ రావు.. సునీల్ రావు ఇంట్లో ప్రవేశించి.. వారి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లుగా నటించి కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ కు వచ్చిన వారి తీరుపై సందేహాలు వచ్చినంతనే డయల్ 100కు ఫోన్ చేయటంతో పోలీసులు అప్రమత్తమై.. యుద్ధ ప్రాతిపదికన బాధితుల్ని గుర్తించారు.
తమ ఆచూకీని పోలీసులు గుర్తించారన్న విషయాన్ని అర్థం చేసుకున్న కిడ్నాపర్లు బాధితులను అప్పా జంక్షన్ వద్ద వదిలేసి వెల్లిపోయారు. ఈ అంశంపై దర్యాప్తు చేసిన పోలీసులు అప్పట్లో మాజీ మంత్రి భూమా అఖిలప్రియను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. ఆ ఎపిసోడ్ కు సంబంధించి అఖిల భర్త.. సోదరుడు ఇద్దరు పరారీలో ఉండటం.. చివరకు అఖిల ప్రియ తనకు ముందస్తు బెయిల్ తెప్పించుకోవటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. తాజాగా బోయిన్ పల్లి పోలీసులు భూమా అఖిలప్రియ.. భార్గవ్.. జగద్విఖ్యాత్ తో పాటు మరో 34 మందిపై పోలీసులు ఛార్జిషీట్ వేశారు. ఇప్పటికి ఆమె భర్త భార్గవ్ రామ్ పరారీలోనే ఉండటం తెలిసిందే. తాజా ఛార్జి షీట్ అఖిలప్రియకు మాత్రమే కాదు.. ఏపీ విపక్షం తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారిందన్న మాట వినిపిస్తోంది.