Begin typing your search above and press return to search.

చిదంబ‌రం - కార్తీని వ‌ద‌ల‌ని ఐఎన్ ఎక్స్ కేసు: తాజాగా మ‌రో చార్జిషీట్‌

By:  Tupaki Desk   |   3 Jun 2020 8:50 AM GMT
చిదంబ‌రం - కార్తీని వ‌ద‌ల‌ని ఐఎన్ ఎక్స్ కేసు: తాజాగా మ‌రో చార్జిషీట్‌
X
కేంద్ర మాజీ మంత్రి చిదంబ‌రం, అత‌డి త‌న‌యుడు కార్తీని ఐఎన్ఎక్స్ మీడియా మనీ ల్యాండరింగ్ కేసు వ‌ద‌ల‌డం లేదు. బెయిల్‌పై విడుద‌లైన వారిద్ద‌రిపై మ‌రోసారి చార్జిషీట్ దాఖ‌లైంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కోర్టు కేసులు ఆన్‌లైన్‌లో స్వీక‌రిస్తుండ‌డంతో ఈ-చార్జీషీట్ దాఖలు చేశారు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, అతడి కుమారుడు కార్తీ, కార్తీ సీఏ ఎస్ఎస్ భాస్కరన్ తదితరుల పేర్లను చార్జిషీట్‌లో నమోదు చేశారు. సాధారణ చార్జీషీట్ దాఖలు చేయాలని ఈడీనీ ప్రత్యేక జడ్జీ అజయ్ కుమార్ ఆదేశించారు.

ఐఎన్ఎక్స్ మీడియాలో ఫారిన్ ఇన్వెస్టెమెంట్ ప్రమోషన్ బోర్డు నిబంధనలు ఉల్లంఘిస్తూ 2007లో రూ.305 కోట్లు జమయ్యాయని వీరిపై ప్ర‌ధాన ఆరోప‌ణ ఉంది. ఈ నగదు అక్రమ లావాదేవీ అని, అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం ప్రోద్బలంతోనే జరిగిందని సీబీఐ చెబుతోంది. దీనిపై 2017 మే 15వ తేదీన చిదంబ‌రంపై కేసు నమోదైన విష‌యం తెలిసిందే. ఆ తర్వాత ఈడీ మనీ ల్యాండరింగ్ కేసు కూడా నమోదు చేసింది.

ఈ ఐఎన్ఎక్స్ మీడియా కేసులో 2019 ఆగస్ట్ 21వ తేదీన చిదంబరాన్ని సీబీఐ అరెస్ట్ చేసింది. దీనికి సంబంధించిన కేసులో ఈడీ అక్టోబర్ 16వ తేదీన అరెస్ట్ చేసింది. జైలులో ఉన్న స‌మ‌యంలో బెయిల్ కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నించాడు. ఆ త‌ర్వాత సీబీఐ కేసులో చిదంబరానికి అక్టోబర్ 22వ తేదీన బెయిల్ రాగా, డిసెంబర్ 4వ తేదీన ఈడీ ఫైల్ కేసిన కేసులో బెయిల్ వచ్చింది. దీంతో ఆయ‌న జైలు నుంచి విడుద‌లయ్యారు. తాజాగా ఇప్పుడు ఈడీ ఈ పైలింగ్ ద్వారా చార్జీషీట్ ఫైల్ చేసింది. త్వ‌ర‌లోనే మ‌రింత విచార‌ణ చేసే అవ‌కాశం ఉంది. తండ్రితో పాటు త‌న‌యుడు కార్తీ కూడా ఈ కేసుల్లో నిందితుడిగా ఉన్న విష‌యం తెలిసిందే.