Begin typing your search above and press return to search.

లక్ అంటే అతడిదే.. రూ.18వేలకే చార్టెడ్ ఫ్లైట్!

By:  Tupaki Desk   |   27 May 2021 2:30 AM GMT
లక్ అంటే అతడిదే.. రూ.18వేలకే చార్టెడ్ ఫ్లైట్!
X
సహజంగా విమానం అంటేనే చాలా విలాసవంతమైన ప్రయాణం. అదీ ఒక్కరి కోసమే ప్రత్యేక విమానం అంటే వావ్.. చాలా బాగుటుంది కదా. ఒక్కరి కోసమే విమానమంతా బుక్ చేసుకోవాలంటే లక్షలు అవసరం. కానీ ఆ ప్రయాణికుడు మాత్రం చాలా లక్కీ. కేవలం రూ.18 వేలకే 360 సీట్ల సామర్ధ్యం ఉన్న బోయింగ్ -777లో ఒంటరిగా ప్రయాణం చేశారు. ఆ విమానంలోని సిబ్బంది అంతా ఒక్కడికే సేవలు చేస్తుంటే ఆ సంతోషం అంతా ఇంతా కాదు కదా. అయితే ఇదంతా ఓ పథకం ప్రకారం జరగకపోవడం విశేషం. కలిసొచ్చే కాలమన్నట్టూ... తన ప్రమేయం లేకుండా విమానంలో ఒక్కడినే ప్రయాణించే అవకాశం వచ్చిందని ఆ ప్రయాణికుడు సంతోషం వ్యక్తం చేశారు.

కొవిడ్ విపత్కర కాలంలో అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. కాగా తమ దేశ పౌరులు, యూఏఈ గోల్డెన్ వీసా కలిగినవారు, దౌత్యవేత్తలకు మాత్రమే అనుమతులు ఇస్తూ యూఏఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో జవేరి అనే వ్యక్తి ముంబయి నుంచి దుబాయ్ వెళ్లాలని అనుకున్నారు. అందుకు రూ.18వేలు ఖర్చు చేసి ఎకానమీ క్లాస్ టికెట్ ను కొనుగోలు చేశారు. ఎయిర్ పోర్టుకు వెళ్లగానే టికెట్ పై తేదీ సరిగా లేదంటూ వారు తిరస్కరించారు. ఎమిరేట్స్ సిబ్బందిని జవేరి సంప్రదించారు. అలా సమస్యకు పరిష్కారం దొరికింది.

విమానం ప్రయాణం కోసం వెళ్లగానే అక్కడ ఎయిర్ హోస్టెస్ నవ్వుతూ తనకు స్వాగతం పలికిందని జవేరి చెప్పారు. అంతేకాకుండా ఆరోజుకు తానొక్కడే ప్రయాణికుడుని, వారంతా తనకోసం ఎదురుచూస్తున్నామని చెప్పారని తెలిపారు. మే 19న జరిగిన ఈ సంఘటన గురించి జవేరి మీడియాకు వివరించారు. విమానం అంతా సిబ్బంది సిబ్బంది చూపించారని, తన లక్కీ నంబర్ 18వ సీట్లో కూర్చొబెట్టారని పేర్కొన్నారు. ఇదో గొప్ప అనుభవం అని కొనియాడారు. డబ్బులు పెడితే కాదు కాలం కలిసివస్తేనే ఇలాంటి బంపర్ ఆఫర్ తగులుతుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

గతంలో ఒకసారి 14 సీట్ల సామర్థ్యం ఉన్న విమానంలో తొమ్మిది మంది ప్రయాణికులతో కలిసి ప్రయాణం చేశానని తెలిపారు. ముంబయి-దుబాయ్ కి 240 సార్లు విమాన ప్రయాణం చేసినట్లు తెలిపారు. ఇలాంటి గొప్ప అనుభవం ఎప్పుడూ రాలేదని అన్నారు. ఈ ప్రయాణం చాలా ప్రత్యేకమని చెప్పుకొచ్చారు. ఈ వార్త చూసిన నెటిజన్లు ఆ ప్రయాణికుడు చాలా లక్కీ అని అంటున్నారు.