Begin typing your search above and press return to search.

అబ్బే రజనీ - కమల్‌ కు అంత సీన్‌ లేదు

By:  Tupaki Desk   |   5 March 2019 1:28 PM GMT
అబ్బే రజనీ - కమల్‌ కు అంత సీన్‌ లేదు
X
తెలుగు సినిమా తారలు గొప్పలకు మన స్టార్‌ హీరోలకు డబ్బాలు కొడతారు కానీ తమిళ యాక్టర్స్‌ అలాక్కాదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. అవతాలి వారి మెప్పు కోసమే.. వారి నుంచి ఏదైనా లాభం పొందాలనే ఆశ వారికి ఏమాత్రం ఉండదు. బంధువు అయినా - బయటివాడు అయినా అందర్ని ఒకేలా చూస్తారు కొంతమంది నటులు. ఇంకా చెప్పాలంటే తమిళ నటుల్లో రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ. అలాంటి వారిలో అందరికంటే ముందు ఉంటాడు చారుహాసన్‌.

చారుహాసన్‌ మరెవో కాదు కమల్‌హాసన్‌ అన్నయ్య.. సుహాసిని వాళ్ల నాన్న.. దర్శకుడు మణిరత్నానికి పిల్లనిచ్చిన మామ. మన తెలుగు సినిమాల్లో కూడా అడపాదడపా కన్పించే చారుహాసన్‌.. ఏ విషయాన్ని అయిన కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలే తమిళ రాజకీయాల్లో సన్షేషన్‌ గా మారాయి.

రీసెంట్‌గా ఒక టీవీ చానెల్‌ కు ఇంటర్వ్యూ ఇచ్చారు చారుహాసన్‌. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందుగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ గురించి మాట్లాడారు చారుహాసన్‌. రజనీకాంత్‌ కు రాజకీయాలంటే పెద్దగా ఇష్టం ఉండదని.. ఆ సమయంలో ఉన్న ఒత్తిడి వల్లే రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. ఇంటికి వెళ్లిన తర్వాత అసలు పార్టీ ఎందుకు పెట్టాన్రా బాబూ అని కనీసం రోజుకి ఒక్కసారైనా రజనీకాంత్‌ అనుకుంటాడని .. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేయదని ప్రకటించాడని గుర్తు చేశారు.

రజనీకాంత్‌ పెద్దగా రిస్క్‌ తీసుకోవడానికి ఇష్టపడని వ్యక్తి అని.. అలాంటి వాడు రాజకీయాల్లోకి వచ్చే అవకాశమే లేదని అన్నారు. ఇక కమల్‌ హాసన్‌ గురించి కూడా మాట్లాడారు చారుహాసన్‌. కమల్‌ రాజకీయాల్లో రాణిస్తాడు కానీ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తమిళనాడులో చాలా పార్టీలు వేళ్లూనికుని పోయాయని.. ఇలాంటి పరిస్థితుల్ని తట్టుకుని నిలబడి సీఎం అవడం అసంభవం అని తేల్చేశారు చారుహాసన్‌. కమల్‌హాసన్‌ అయినా రాజకీయాల కోసం సినిమాలు వదులుకుంటాడు కానీ రజనీకాంత్ అస్సలు వదులుకోడని అన్నారు చారుహాసన్‌.