Begin typing your search above and press return to search.

వెంటాడిన పోలీసులు‌.. పారిపోయిన టీడీపీ అధ్య‌క్షుడు!

By:  Tupaki Desk   |   11 April 2021 5:32 AM GMT
వెంటాడిన పోలీసులు‌.. పారిపోయిన టీడీపీ అధ్య‌క్షుడు!
X
రీకాకుళం జిల్లా టీడీపీ అధ్య‌క్షుడు ర‌వికుమార్ పోలీసుల‌ను త‌ప్పించుకొని పారిపోయిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న్ను అరెస్టు చేయ‌డానికి పోలీసులు ఇంటికి వెళ్ల‌గా.. అప్ప‌టికే విష‌యం తెలుసుకున్న ఆయ‌న‌.. వారికి చిక్క‌కుండా ప‌రార‌య్యాడ‌ని స్థానికంగా చ‌ర్చించుకుంటున్నారు. ఇంత‌కీ విష‌యం ఏమంటే..?

ప‌రిష‌త్ ఎన్నిక‌ల పోలింగ్ రోజున పొందూరు మండ‌లం పెనుబ‌ర్తి వైసీపీ ఎంపీటీసీ, ఆ గ్రామ స‌ర్పంచ్ భ‌ర్త ముర‌ళీ కృష్ణ‌పై ర‌వికుమార్ వ‌ర్గం దాడిచేసిన‌ట్టుగా పోలీసు కేసు న‌మోదైన‌ట్టు తెలుస్తోంది. అంతేకాకుండా.. పోలీసు విధుల‌కు ఆటంకం క‌లిగించార‌ని మ‌రో కేసు కూడా పెట్టిన‌ట్టు తెలుస్తోంది. దీంతో.. ర‌వికుమార్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు ఆయ‌న‌ ఇంటికి వెళ్ల‌గా.. అప్ప‌టికే పారిపోయాడ‌ని ప్ర‌చారం సాగుతోంది.

ర‌వికుమార్ గ‌తంలోనూ అధికారుల ప‌ట్ల అనుచితంగా ప్ర‌వ‌ర్తించార‌నే అభియోగాలు ఉన్నాయి. రెవెన్యూ అధికారుల‌ను దుర్భాష‌లాడిన‌ట్టుగా కూడా ఫిర్యాదులు అందాయి. ఇప్పుడు.. మ‌రోసారి ఆయ‌న‌పై పోలీసు కేసు న‌మోద‌వ‌డం గ‌మ‌నార్హం. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచిన ర‌వికుమార్ ఓడిపోయారు.