Begin typing your search above and press return to search.

ప్రేమ..ముదిరితే పెళ్లి.. ఇదే కీలకం

By:  Tupaki Desk   |   16 Oct 2019 4:27 AM GMT
ప్రేమ..ముదిరితే పెళ్లి.. ఇదే కీలకం
X
ఓ 30 ఏళ్ల క్రితం నాటి ముచ్చట.. ప్రభుత్వ పాఠశాలలో ఒక అబ్బాయిని అమ్మాయి చూసి నవ్వినా.. కనీసం చూసినా ఆమె ప్రేమలో పడిందనడానికి సిగ్నల్ అనుకుంటారు. ఆమెకు ప్రపోజ్ చేయడానికి చెప్పులు అరిగేలా తిరుగుతుంటారు.. పావురాలతో సందేశాలు.. ఉత్తరాలతో ప్రేమలేఖలు రాసేవారు.. అయినా ధైర్యం చేసి ప్రేమను సూటిగా చెప్పని వారు ఎందరో..

కానీ నేడు.. అంతా ఆధునికం.. స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని అమ్మాయిల చుట్టూ అబ్బాయిలు చెప్పులు అరిగేలా తిరగడం లేదు.. కేవలం ఆమె ఫోన్ నంబర్ తీసుకోవడం.. చాటింగ్ మొదలు పెట్టడం.. పరిచయం చేసుకోవడం.. ఆ తర్వాత ప్రేమ.. ముదిరితే పెళ్లి.. ఇలా చాటింగ్ అనేది ఇప్పుడు ఏ ఇద్దరినీ కలపడానికి అయినా వారధిగా మారిందని అర్థమవుతోంది.

అయితే చాటింగ్ అనేది ఒక కళ.. అమ్మాయిని ముగ్గులోకి దింపడం.. మనతో చాటింగ్ చేసేలా చేయడం.. చివరకు ప్రేమకు ఒప్పించడం అంతా ఈజీయేమీ కాదు.. కలుపుగోలుగా.. ఫన్నీ థింగ్స్, సెన్స్ ఆఫ్ హ్యుమర్ ఉన్నవాళ్లకు అదీ ఈజీనే.. కానీ స్తబ్దుగా.. సీరియస్ గా - ఆవేశంగా - బేలగా ఉండేవాళ్లకు మాత్రం అమ్మాయిలను పడేయడం తలకు మించిన భారం..

సో ఇప్పుడు ప్రేమకు వారధిగా చాటింగ్ మారిపోయింది. సుస్వాగతం సినిమాలో హీరోయిన్ ప్రేమ కోసం నాలుగేళ్లు వెయిట్ చేసి సర్వస్వం కోల్పోయిన పవన్ కళ్యాణ్ లాంటి మగాళ్ల ప్రేమలు ఇప్పుడు కనపడకపోవడానికి ప్రధాన కారణం ఈ స్మార్ట్ ఫోన్ చాటింగ్ విప్లవం.. సో ప్రేమికులకు కాలాన్ని ఎంతో స్థైర్యాన్ని ఇచ్చిన ఈ ఆధునిక చాటింగ్ వారికి కల్పతరువుగా మారింది.