Begin typing your search above and press return to search.

స‌్కార్ఫ్ తో వ‌ర్సిటీలోకి వస్తే నో ఎంట్రీ!

By:  Tupaki Desk   |   18 July 2018 4:44 AM GMT
స‌్కార్ఫ్ తో వ‌ర్సిటీలోకి వస్తే నో ఎంట్రీ!
X
దేశంలో మ‌రే విశ్వ‌విద్యాల‌యం అమ‌లు చేయ‌ని స‌రికొత్త రూల్‌ ను ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ఒక వ‌ర్సిటీ తెర మీద‌కు తీసుకొచ్చింది. సంచ‌ల‌నం సృష్టిస్తున్న ఈ రూల్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ కు చెందిన చౌద‌రి చ‌ర‌ణ్ సింగ్ విశ్వ‌విద్యాల‌యం త‌మ ద‌గ్గ‌ర చ‌దువుకుంటున్న మ‌హిళ‌ల‌కు స‌రికొత్త రూల్ పెట్టింది.

ముఖం క‌నిపించ‌కుండా స్కార్ఫ్ క‌ట్టుకొని వ‌స్తే కాలేజీలోకి అనుమ‌తించేది లేద‌ని వ‌ర్సిటీ తేల్చి చెప్పింది. వ‌ర్సిటీకి చెంద‌ని వారిని లోప‌ల‌కు రానివ్వ‌కుండా ఉండేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెబుతున్నారు. వ‌ర్సిటీల్లో ఈ త‌ర‌హా నిర్ణ‌యం తీసుకోవ‌టం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.

స్కార్ప్ నిషేదం వెనుకున్న కార‌ణాన్ని వెల్ల‌డిస్తున్న వ‌ర్సిటీ అధికారులు.. వ‌ర్సిటీకి సంబంధం లేని యువ‌తులు ప‌లువురు క్యాంప‌స్ లో క‌నిపిస్తున్నార‌ని.. వారిని త‌మ ఐడెంటిటీ కార్డు అడిగిన‌ప్పుడు స‌రైన ఆధారాలు ఉండ‌టం లేద‌ని.. ఇలాంటి వారంతా స్కార్ఫ్ తో క‌నిపిస్తున్నార‌న్నారు.

ఈ కార‌ణంతోనే స్కార్ప్ లేకుండా ఉంటే.. కొత్త‌వారిని గుర్తించ‌టం ఈజీ అంటున్నారు. అదే ముఖానికి అడ్డుగా స్కార్ఫ్ కార‌ణంగా కొత్త వారిని గుర్తించ‌టం క‌ష్టంగా చెబుతున్నారు. వ‌ర్సిటీ తీసుకున్న ఈ నిర్ణ‌యంపై మిశ్ర‌మ స్పంద‌న వ్య‌క్త‌మ‌వుతోంది. కొంద‌రు విద్యార్థులు ఈ కొత్త రూల్ కు సానుకూలంగా స్పందిస్తుంటే.. మ‌రికొంద‌రు మాత్రం వ్య‌తిరేకిస్తున్నారు.

వ‌ర్సిటీ సిబ్బంది త‌మ విధుల్ని స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించ‌కుండా.. త‌మ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించుకోవ‌టానికి ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా ఆరోపిస్తున్నారు. బ‌య‌టవారు వ‌ర్సిటీ లోప‌ల‌కు రాకుండా చూడాల్సిన బాధ్య‌త వ‌ర్సిటీ అధికారుల‌ద‌ని.. దీన్ని త‌ప్పించుకోవ‌టానికి ఈ నిర్ణ‌యం స‌రికాదంటున్నారు. తాజా నిర్ణ‌యంతో క్యాంప‌స్ వాతావ‌ర‌ణం దెబ్బ తింటుంద‌ని చెబుతున్నారు.