Begin typing your search above and press return to search.

మిస్టర్ పీఎం అని గట్టిగా అరిచిన ఆమె దగ్గరకు వెళ్లిన మోడీ ఏం చేశారు?

By:  Tupaki Desk   |   22 Oct 2021 6:34 AM GMT
మిస్టర్ పీఎం అని గట్టిగా అరిచిన ఆమె దగ్గరకు వెళ్లిన మోడీ ఏం చేశారు?
X
ఛావి అగర్వాల్. పాతికేళ్ల ఈ దివ్యాంగురాలు ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారారు. కుర్చీకి మాత్రమే పరిమితమయ్యే ఆమె వద్దకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వెళ్లటమే కాదు.. ఆమెతో కాసేపు గడిచిన వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. అలా అని.. ఇదంతా షెడ్యూల్ ప్రోగ్రాం కాదు. అనుకోకుండా అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామం ఆసక్తికరంగానే కాదు.. ఛావి అగర్వాల్ కు ఇప్పుడు కొత్త గుర్తింపును తెచ్చి పెట్టింది.

నాటకీయ పరిణామాలకు అంతే నాటకీయంగా స్పందించటంలో ప్రధాని నరేంద్ర మోడీ ముందుంటారు. ఈ తీరును కొందరు తప్పు పడితే.. మరికొందరు మాత్రం ఇలాంటివి మోడీకి మాత్రమే సాధ్యమంటూ ప్రశంసలతో ముంచెత్తుతుంటారు. తాజాగా వంద కోట్ల మార్కును టచ్ చేసిన వ్యాక్సినేషన్ ప్రోగ్రాంకు సంబంధించి దేశ రాజధాని ఢిల్లీలోని రాం మనోహర్ లోహియా ఆసుపత్రిని సందర్శించారు. వ్యాక్సినేషన్ లో భారత్ వంద కోట్ల మైలురాయిని దాటినంతనే ప్రధాని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిని సందర్శించారు.

అక్కడి వైద్య సిబ్బందికి విక్టరీ సింబల్ ను చూపించి.. వారిని అభినందించారు. ఇదోచారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. 130 కోట్ల ప్రజల సంయుక్త స్ఫూర్తి సాధించిన ఘన విజయంగా అభివర్ణించారు. ఈ గమ్యానికి చేరుకోవటానికి కారణమైన వైద్యులు.. వైద్య సిబ్బందిని ఆయన అభినందలు తెలిపారు. టీకాతో దేశ ప్రజలకు సురక్షిత కవచం లభించిందన్నారు.

రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి వచ్చి తిరిగి వెళుతున్న వేళ.. అనూహ్యంగా అక్కడే ఉన్న ఛావి అగర్వాల్ అనే పాతికేళ్ల యువతి ప్రధాని మోడీని చూసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయి.. పట్టలేని సంతోషంతో ప్రధానిని గట్టిగా పిలిచారు. దీనికి స్పందించిన నరేంద్ర మోడీ.. వెనక్కి తిరిగి చూడటమేకాదు.. ఆమె వద్దకు తానే స్వయంగా వచ్చారు. కాసేపు ఆమెతో మాట్లడారు.ఆమెకు పాడటం ఇష్టమని తెలుసుకున్న మోడీ.. ఒక పాట పాడాలని కోరి.. ఆమె పాడుతుంటే విన్నారు. త్వరలోనే మళ్లీ కలుస్తానని మాట ఇచ్చి మరీ ముందుకు కదలటం అక్కడి వారిని విపరీతంగా ఆకర్షించింది. దీంతోఛావి అగర్వాల్ ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారారు.