Begin typing your search above and press return to search.

వర్మ పై చీటింగ్ కేసు.. ఫ్యాన్స్ ఆవేదన

By:  Tupaki Desk   |   24 May 2022 5:19 AM GMT
వర్మ పై చీటింగ్ కేసు.. ఫ్యాన్స్ ఆవేదన
X
వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ ఒకప్పుడు తన సినిమాలు సూపర్‌ హిట్‌ అవ్వడంతో వార్తల్లో నిలిచే వాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు తన సినిమాలను వివాదాస్పదం చేయడం ద్వారా వార్తల్లో నిలిచేవాడు. ఆ తర్వాత వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉండటం వల్ల వార్తల్లో నిలిచే వాడు. ఇప్పుడు పోలీసు కేసులు.. కోర్టు నోటీసుల కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు.

ఇటీవలే డేంజరస్ సినిమా విషయంలో నెలకొన్న వివాదం కారణంగా చాలా రోజుల పాటు కోర్టు కేసులతో వార్తల్లో నిలిచిన రామ్‌ గోపాల్‌ వర్మ ఇప్పుడు మరో వివాదం కారణంగా వార్తల్లో నిలిచాడు. అది కూడా పోలీసు కేసు వల్లే అవ్వడం విశేషం. వర్మ దిశా ఎన్ కౌంటర్ అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెల్సిందే. ఆ సినిమా కు స్వయంగా తానే నిర్మాతగా వ్యవహరించాడు అనే విషయం కూడా తెల్సిందే.

ఆ సినిమా నిర్మాణం కోసం వర్మ రూ.56 లక్షల ను మియాపూర్ కు చెందిన శేఖర్ రాజు అనే వ్యక్తి వద్ద తీసుకున్నాడట. ఆ డబ్బు తిరిగి ఇవ్వమంటే బెదిరించడంతో పాటు.. ఆ డబ్బును తిరిగి ఇచ్చేది లేదు.. సినిమా ఆడలేదు కనుక నేను డబ్బులు ఇవ్వలేను అంటూ పేచీ పెడుతున్నాడు అంటూ శేఖర్ రాజు ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసుల వద్ద ఫిర్యాదు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.

దిశా సినిమా కు ఫైనాన్సియర్ గా వ్యవహరించిన ఆ వ్యక్తి ప్రస్తుతం వర్మ నుండి రావాల్సిన డబ్బు కోసం డిమాండ్‌ చేస్తున్నాడు. ఆ డబ్బు ఇచ్చే వరకు న్యాయ పోరాటం చేస్తానంటూ అతడు పేర్కొన్నాడు. చీటింగ్ కేసు నమోదు చేయడంతో వర్మ నుండి ఎలాంటి స్పందన వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ మద్య సంచలనం రేపిన ఒక ఎన్‌ కౌంటర్‌ కు సంబంధించిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను చేయడం జరిగింది.

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఒకప్పుడు అద్బుతమైన కళా కండాలను తెరకెక్కించాడు. కాని ఇప్పుడు మాత్రం చెత్త సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్ గా మారాడు.

అది చాలదు అన్నట్లుగా ఆయన్ను కెరీర్‌ ఆరంభం నుండి అభిమానిస్తూ వస్తున్న వారి మనసు లు నొప్పించే విధంగా పోలీసు కేసుల్లో ఇరుక్కోవడం.. చీటింగ్ కేసుల్లో చిక్కుకోవడం వంటి పనులు చేస్తున్నాడు. వర్మ ఇప్పటికైనా సినిమాలు చేస్తే గతంలో మాదిరిగా చేయాలి.. లేదంటే సినిమాలు ఆపేసి సైలెంట్ గా ఉండి తన గౌరవం నిలుపుకోవాలంటూ అభిమానులు ఆవేదనతో వ్యాఖ్యలు చేస్తున్నారు.